టాలీవుడ్ హీరోయిన్ ల రెమ్యునరేషన్

0
23
heroines remunerations

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్- టాలీవుడ్ లో స్టార్ హీరోలకు ధీటుగా రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ లు తయారయ్యారు. ఒకప్పుడు హీరోలకు మాత్రమే పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఉండేది కానీ కాలక్రమేణా మార్పులు సంభవించాయి. సావిత్రి కాలం నాటి నుండే హీరోయిన్ లకు స్టార్ డం వచ్చేసింది. హీరోలతో పోటీ పడి ఎక్కువ మొత్తంలోనే డబ్బులు తీసుకుంటున్నారు. అదే సంప్రదాయం ఇప్పుడు కూడా కోనసాగుతూనే ఉంది టాలీవుడ్ లో. పలువురు స్టార్ హీరోయిన్ లు పెద్ద మొత్తంలోనే రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. టాలీవుడ్ లో భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ ల జాబితా ఒకసారి చూద్దామా !

అనుష్క :సాలిడ్ అందాల భామ అనుష్క ఒక్కో సినిమాకు 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటోంది. హీరోలతో సమానమైన ఇమేజ్ ని సొంతం చేసుకుంది అనుష్క. హీరోలతో సంబంధం లేకుండా తన సొంత ఇమేజ్ తోనే తన సినిమాలకు ఓపెనింగ్స్ రాబడుతోంది అనుష్క అలాగే ఒంటి చేత్తో తన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. అందుకే అనుష్కకు ఈ భారీ రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్దపడుతున్నారు నిర్మాతలు.

సమంత :పెళ్లి చేసుకొని హాయిగా కాపురం కూడా చేసుకుంటున్న సమంత కూడా ఇంకా స్టార్ హీరోయిన్ గానే వెలుగొందుతోంది. సాధారణంగా హీరోయిన్ లకు పెళ్లి అయితే చాలు ఆ హీరోయిన్ ని పక్కన పెట్టేస్తారు దర్శక నిర్మాతలు , హీరోలు కానీ సమంత విషయంలో మాత్రం అలా కాదు ఇప్పటికి కూడా ఇంకా స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతోంది పైగా పెళ్లి అయ్యాకే ఓ బేబీ అంటూ సోలోగా వచ్చి 50 కోట్ల వసూళ్ళని సాధించి సంచలనం సృష్టించింది. సమంతకు 2 కోట్ల నుండి 2. 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారు నిర్మాతలు.

కాజల్ అగర్వాల్ :సినిమారంగంలోకి వచ్చి 15 సంవత్సరాలు అవుతున్నా ఇంకా హీరోయిన్ గానే కొనసాగుతోంది కాజల్ అగర్వాల్. తన చెల్లి హీరోయిన్ గా వచ్చి పెళ్లి చేసుకొని హాయిగా కాపురం చేసుకుంటూ ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అయితే కాజల్ మాత్రం ఇంకా హీరోయిన్ గా అవకాశాలు పొందుతూనే ఉంది. ఈ భామకు కూడా సౌత్ లో మంచి డిమాండ్ ఉండటంతో ఒక్కో సినిమాకు కోటిన్నర నుండి 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటోంది.

పూజా హెగ్డే :గ్లామర్ తో కుర్రాళ్ల గుండెల్లో మంటలు పెడుతున్న ఈ భామ కెరీర్ ప్రారంభంలో ఐరన్ లెగ్ గా ముద్రపడింది. వరుస ప్లాప్ చిత్రాలతో కెరీర్ అగమ్యగోచరంగా తయారైన సమయంలో వరుస విజయాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్ పొందింది. ఈ భామ ఒక్కో సినిమాకు 2 కోట్ల పైనే రెమ్యునరేషన్ అందుకుంటోంది.

ఇక వీళ్ళతో పాటుగా తమన్నా కోటి పైనే తీసుకుంటోంది రెమ్యునరేషన్ . రకుల్ ప్రీత్ సింగ్ , రాశి ఖన్నా , సాయి పల్లవి కోటి వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. నివేదా థామస్ , నిధి అగర్వాల్ , నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ , అదితిరావు హైదరి తదితరులు 60 లక్షల పైనే రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.

మునుపటి వ్యాసంఎన్టీఆర్ కు కరోనా టెస్ట్
తదుపరి ఆర్టికల్వేదిక న్యూ ఫొటోస్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి