టాలీవుడ్ హీరోలు – వాళ్ళ రెమ్యునరేషన్

0
40
tfc logo

టాలీవుడ్ హీరోలు – వాళ్ళ రెమ్యునరేషన్

టాలీవుడ్ హీరోలు ఇతర హీరోలతో పోటీపడి భారీ రెమ్యునరేషన్ లు అందుకుంటున్నారు. మూడు నాలుగేళ్ళ క్రితం వరకు ఎంతటి పెద్ద హీరో ఆయినా 20 కోట్లు మించకుండా రెమ్యునరేషన్ తీసుకోలేదు కానీ ఒక్కసారిగా టాలీవుడ్ హీరోల రేంజ్ పెరిగింది. దాంతో ప్రతీ ఒక్క స్టార్ హీరో 10 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ లు కూడా ఇప్పటి స్టార్ హీరోలకు తగ్గకుండా భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతుండటంతో భారీ రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడటం లేదు.

సీనియర్ హీరోలను పక్కన పెడితే ఇప్పుడున్న యంగ్ హీరోలు తమ స్టార్ డంని ఖండాంతరాలు దాటిపోయేలా చేస్తూ వసూళ్ల సునామీ సృష్టిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నారు కాబట్టే పాన్ ఇండియా చిత్రాలు తయారౌతున్నాయి. ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న హీరోలలో ప్రభాస్ అందరికంటే ముందున్నాడు. బాహుబలి తో ఒక్కసారిగా ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ఇక పవన్ కల్యాణ్ , మహేష్ బాబు , ఎన్టీఆర్ , చరణ్ , అల్లు అర్జున్ లు కూడా పాన్ ఇండియా చిత్రాలతో తమ మార్కెట్ ని మరింతగా పెంచుకుంటున్నారు. ఇక మన టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యునరేషన్ చూస్తే ఒక్కొక్కరు ఇంచుమించుగా ఇదే మొత్తం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకసారి వాళ్ళ రెమ్యునరేషన్ చూద్దామా.

ప్రభాస్ – 100 కోట్లు
మహేష్ బాబు – 80 కోట్లు
పవన్ కల్యాణ్ – 50 కోట్లు
ఎన్టీఆర్ – 35 కోట్లు
అల్లు అర్జున్ – 35 కోట్లు
రాంచరణ్ – 35 కోట్లు
బాలకృష్ణ – 10 కోట్లు
చిరంజీవి –  25 కోట్లు
నాగార్జున  – 10 కోట్లు
వెంకటేష్ –  10 కోట్లు
విజయ్ దేవరకొండ – 12 కోట్లు
రవితేజ –  8 కోట్లు
నాని – 8 కోట్లు
శర్వానంద్ – 5 కోట్లు
రామ్ – 5 కోట్లు
సాయిధరమ్ తేజ్ – 5 కోట్లు

మునుపటి వ్యాసంసమంత ఎందుకు ఏడ్చిందో తెలుసా
తదుపరి ఆర్టికల్నాని ‘వి’ సినిమా కథ ఇదేనంటూ తెగ ప్రచారం సాగుతోంది
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి