కరోనాతో టాలీవుడ్ నటుడు మృతి

0
42
kosuri venu gopal

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్కరోనా మహమ్మారి టాలీవుడ్ నటుడ్ని బలి తీసుకుంది. కరోనా ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనాతో మరణించగా తాజాగా టాలీవుడ్ నటుడు కోసూరి వేణుగోపాల్ కరోనాతో బాధపడుతూ మరణించాడు. కోసూరి వేణుగోపాల్ తెలుగులో పలు చిత్రాల్లో నటించాడు. అయితే ఎక్కువగా గుర్తింపు పొందింది మాత్రం మర్యాద రామన్న , ఛలో , విక్రమార్కుడు , పిల్ల జమీందార్ వంటి చిత్రాలతోనే. తనదైన యాస , భాషతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు కోసూరి వేణుగోపాల్.

గత 22 రోజులుగా కరోనాతో బాధపడుతున్న కోసూరి వేణుగోపాల్ హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో గల ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే 22 రోజులుగా చికిత్స పొందుతున్నా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో సెప్టెంబర్ 23 అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. కోసూరి వేణుగోపాల్ మరణవార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు.

ఇటీవలే నటుడు జయప్రకాశ్ రెడ్డి గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆ సంఘటన ఇంకా మరువకముందే నటుడు కోసూరి వేణుగోపాల్ మరణవార్త టాలీవుడ్ ని దిగ్బ్రాంతికి గురిచేసింది. టాలీవుడ్ లో వరుస మరణాలతో విషాదం అలుముకుంది. కోసూరి వేణుగోపాల్ కు నటన అంటే మక్కువ అందుకే ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటించాడు. రిటైర్ అయినప్పటికీ సినిమాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే కరోనా రూపంలో మృత్యువు కబళించింది కోసూరిని. 

మునుపటి వ్యాసంవిక్కీ డోనర్ నటుడు మృతి
తదుపరి ఆర్టికల్అభినందన్ వర్ధమాన్ పాత్రలో విజయ్ దేవరకొండ
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి