అప్సర రాణి అందాలతో థ్రిల్లర్ ట్రైలర్

0
51

అందాల భామ అప్సరా రాణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం థ్రిల్లర్. రాంగోపాల్ వర్మ ఫ్యాక్టరీ నుండి వస్తున్న ఈ చిత్రం రేపు ఉదయం11 గంటలకు ఆర్జీవి వరల్డ్ థియేటర్ లో విడుదల కానుంది. ఇక తాజాగా థ్రిల్లర్ ట్రైలర్ విడుదల చేశారు వర్మ. ఆ ట్రైలర్ చూస్తుంటే కుర్రాళ్ళు పిచ్చెక్కిపోవడం ఖాయం అంత దారుణంగా ఉంది అప్సర రాణి అందాలు. ఏమాత్రం మొహమాటం పడకుండా వర్మకు ఎలా కావాలో అలా నటించింది. ఈ అందాల భామ అందాలను చూపెట్టడానికి వర్మ రకరకాల భంగిమల్లో కెమెరాలను వాడాడు. అన్ని రకాల యాంగిల్స్ వాడటంతో పాటు ట్రైలర్ లో అవే ఎక్కువగా చూపించాడు.

ట్రైలర్ తోనే ప్రేక్షకులను తన బుట్టలో పడేయగల సమర్ధుడు రాంగోపాల్ వర్మ. ట్రైలర్ , టీజర్ లలో మినహా సినిమాలో పెద్దగా ఏమి ఉండదు అనే విషయం దాదాపుగా అందరికీ తెలుసు. కానీ మళ్లీ మళ్లీ మోసపోతూనే ఉంటారు అసలు విషయం తెలిసి కూడా. థ్రిల్లర్ చిత్రం ఒక్క తెలుగు లోనే కాకుండా తమిళం , మలయాళం , హిందీ భాషల్లో కూడా విడుదల చేస్తున్నాడు వర్మ. మొత్తానికి థ్రిల్లర్ చిత్రానికి హైలెట్ అప్సర రాణి అందాలు. ఈ భామ విచ్చలవిడిగా రెచ్చిపోయి చూపించింది. ఇక ప్రేక్షకులు డబ్బులు పెట్టి చూసుకోవడమే తరువాయి. రేపు ఉదయం11 గంటలకు రెడీ గా ఉండండి.

 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి