మహేష్ బాబు కోసం క్యూలో ఉన్న ముగ్గురు డైరెక్టర్లు

0
42
mahesh babu

మహేష్ బాబు కోసం క్యూలో ఉన్న ముగ్గురు డైరెక్టర్లు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం ముగ్గురు టాప్ డైరెక్టర్లు క్యూలో ఉన్నారు. మహేష్ తాజాగా పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే సర్కారు వారి పాట చిత్రం తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి కానీ రాజమౌళి తో సినిమా అంటే కనీసం రెండు , మూడేళ్లు వెయిటింగ్ తప్పదు కాబట్టి సర్కారు వారి పాట చిత్రం తర్వాత మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట మహేష్ బాబు.

ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్ , చరణ్ లతో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు. అది కంప్లీట్ కావాలంటే మరో ఆరు నెలలు నుండి ఏడాది సమయం పట్టేలా కనబడుతోంది. ఆ తర్వాత ఎలాగూ మహేష్ కోసం చేసిన కథ ని పక్కాగా స్క్రిప్ట్ చేయాలంటే జక్కన్న కొంత సమయం పడుతుంది కాబట్టి ఈలోపు మరో సినిమా చేసుకోవచ్చని భావిస్తున్నాడు మహేష్. దాంతో మహేష్ బాబు కోసం ముగ్గురు దర్శకులు లైన్ లో ఉన్నారు. ప్రశాంత్ నీల్ , సందీప్ రెడ్డి వంగా , లోకేష్ కనగరాజ్ ఈ ముగ్గురు దర్శకులు కూడా మహేష్ బాబుతో సినిమా చేయాలని ఎదురు చూస్తున్నారు.

ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దాని తర్వాత ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఇక లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం తమిళ సినిమా చేస్తున్నాడు. కార్తీ హీరోగా నటించిన ఖైదీ చిత్రంతో దర్శకుడు గా పరిచయమయ్యాడు లోకేష్ కనగరాజ్. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో లోకేష్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి తో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురు దర్శకులతో పాటుగా మరికొంతమంది కూడా మహేష్ కోసం కథలతో రెడీగా ఉన్నారు కానీ వాళ్లలో మహేష్ బాబు ఛాన్స్ ఎవరికి ఇస్తారో చూడాలి.

మునుపటి వ్యాసంవనిత మూడో భర్తకు గుండెపోటు
తదుపరి ఆర్టికల్అనుష్క కోసం ప్రభాస్ ని రిక్వెస్ట్ చేస్తున్న అభిమానులు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి