ప్రభాస్ ఐదేళ్ల కష్టానికి ప్రతిఫలం ఈ ఇమేజ్

0
35
prabhas image is not a single day

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఇప్పుడున్న పాన్ ఇండియా సూపర్ స్టార్ హీరో ఇమేజ్ ఊరికే రాలేదు. ఎంతో కష్టపడితే ఈ ఇమేజ్ వచ్చింది. అంతేనా ఒక హీరోకు ఎంతో విలువైన అయిదు సంవత్సరాలను ఒక్క బాహుబలి కోసం కేటాయించాడు. కేవలం దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళిని నమ్మి ఎంతో విలువైన 5 సంవత్సరాల సమయాన్ని బాహుబలి కోసం కేటాయించాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. షూటింగ్ సమయంలో పలుమార్లు గాయాలయ్యాయి అయినా ఓర్చుకున్నాడు అందుకే ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు ప్రభాస్.

ఇప్పుడు ప్రభాస్ అనుభవిస్తున్న స్టార్ డం ఊరికే రాలేదు ఎంతో కష్టపడితే వచ్చింది. దాంతో ఒకప్పుడు భారతదేశంలో సూపర్ స్టార్ గా ఎదిగింది రజనీకాంత్ మాత్రమే. రజనీకాంత్ చిత్రానికి ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉండేది. రజనీకాంత్ సినిమా వస్తోందంటే మిగతా హీరోలు తమ సినిమాల విడుదల వాయిదా వేసుకునే వారు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. రజనీకాంత్ స్థానాన్ని ఆక్రమించాడు ప్రభాస్. అసలు చెప్పాలంటే భారతదేశంలో ఇప్పుడు ఏ హీరో కూడా ప్రభాస్ రేంజ్ కు దరిదాపుల్లో లేరు అనే చెప్పాలి.

ఇందుకు ఉదాహరణ సాహో చిత్రమే. సాహో భారీ అంచనాల మధ్య విడుదల అయ్యింది. అయితే ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది కానీ భారీ వసూళ్లు సాధించి ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్లాప్ టాక్ తో ప్రపంచ వ్యాప్తంగా 430 కోట్ల వరకు సాధించింది సాహో. ఇక ఇప్పుడు ఆది పురుష్ అనే సినిమాకు రెడీ అవుతున్నాడు ప్రభాస్. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడు గా నటిస్తుండగా సీతగా కియరా అద్వానీ నటించనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు ఓం రౌత్ కియరా అద్వానీని కలిసి ఇటీవలే కథ కూడా చెప్పాడని బాలీవుడ్ కథనం వినబడుతోంది.

మునుపటి వ్యాసంషాకింగ్ న్యూస్: హీరోయిన్ పై దాడి
తదుపరి ఆర్టికల్ట్రైనర్ కు రేంజ్ రోవర్ కారుని గిఫ్ట్ గా ఇచ్చిన ప్రభాస్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి