అల్లు అర్జున్ చిత్రంలో ఈ హీరో నటించడం లేదట

0
45
allu arjun

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో విలన్ గా తమిళ నటుడు మాధవన్ నటించనున్నట్లు గతకొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక ఇదే సమయంలో మాధవన్ నటించిన నిశ్శబ్దం చిత్రం అమెజాన్ లో విడుదల అవుతుండటంతో ఆ సినిమా ప్రమోషన్ కోసం ఆన్ లైన్ మీడియా ఇంటర్వ్యూ కి హాజరు కాగా పుష్ప చిత్రంలో విలన్ గా నటిస్తున్నారా ? అని అడిగితే అలాంటిదేమి లేదని , నన్ను ఎవరూ సంప్రదించలేదు …… నేను పుష్ప చిత్రంలో నటిస్తున్నాను అంటూ వచ్చిన వార్తలు గాలి వార్తలే అని కొట్టిపడేసాడు మాధవన్.

తమిళ చిత్రాల్లోనే కాకుండా హిందీలో అలాగే తెలుగుతో పాటుగా ఇతర భాషా చిత్రాల్లో కూడా నటిస్తూ తనకంటూ ఓ విభిన్నమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు మాధవన్. తాజాగా అనుష్క సరసన నిశ్శబ్దం చిత్రంలో నటించాడు. ఈరోజు ఆ సినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. అనుష్క నటించిన చిత్రం కావడంతో నిశ్శబ్దం చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ఆ అంచనాలకు తగ్గట్లుగా నిశ్శబ్దం ఉంటుందా ? లేదా ? అన్నది చూడాలి.

ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే ……… పుష్ప గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం కావడంతో పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్నారు. అందుకోసం బాలీవుడ్ , కోలీవుడ్ , మోలీవుడ్ ఇలా అన్ని బాషల నటీనటులను ఎంపిక చేస్తున్నారు సుకుమార్. అల్లు అర్జున్ సరసన కన్నడ భామ రష్మిక మందన్న నటిస్తోంది ఈ చిత్రంలో. విజయ్ సేతుపతి ని విలన్ పాత్రలో అనుకున్నారు విజయ్ సేతుపతి కూడా ఒప్పుకున్నాడు కానీ తీరా సమయానికి డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోవడంతో తప్పుకున్నాడు.  

మునుపటి వ్యాసంజగన్ నిర్ణయంతో షాక్ అయిన రోజా
తదుపరి ఆర్టికల్శ్రద్దా దాస్ న్యూ ఫొటోస్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి