మోహన్ బాబు ఇంటిపై దాడికి యత్నించిన వాళ్ళు దొరికారు

0
51

నటుడు మోహన్ బాబు శంషాబాద్ సమీపంలోని జల్ పల్లి వద్ద ఫామ్ హౌజ్ కట్టుకున్న విషయం తెలిసిందే. కాగా ఆ ఫామ్ హౌజ్ లోకి నిన్న చొరబడేందుకు ప్రయత్నించిన నలుగురు ఆగంతకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైలార్ దేవ్ పల్లి దుర్గా నగర్ కు చెందిన నలుగురు యువకులు గా తేల్చారు పోలీసులు. అయితే వాళ్ళు మోహన్ బాబు ఇంట్లోకి ఎందుకు వెళ్లాలను కున్నారు, ఏం చేయాలనుకున్నారు అన్న విషయం మీద కూపీ లాగుతున్నారు. సీసీ టీవీ లో కనిపించిన ఆధారాలతో కారు నెంబర్ ని గుర్తించిన పోలీసులు నలుగురు యువకులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.

మోహన్ బాబు ఇంట్లోకి దుండగులు వచ్చారు అన్న వార్త నిన్న సాయంత్రం నుండి కలకలం సృష్టించింది. మోహన్ బాబు ఫిర్యాదు మేరకు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఆ నలుగురు యువకులు కూడా బెదిరించడానికి చేసారా ? లేక ఆకతాయి తనంతో చేసారా ? మద్యం మత్తులో జరిగిందా ? అన్నది తేలాల్సి ఉంది. 2014 వరకు హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీహిల్స్ లో ఉండేవాడు మోహన్ బాబు. అయితే ప్రధాన రహదారి కావడంతో రణగొన ధ్వనులకు దూరంగా జల్ పల్లి వద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. ప్రస్తుతం సినిమాల్లో నటించకుండా ఖాళీగా ఉంటున్నాడు మోహన్ బాబు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి