తెరపైకి దొడ్డి కొమురయ్య బయోపిక్

0
46

బాలీవుడ్ లో అలాగే టాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలు బయోపిక్ లు అటు హిందీలో ఇటు తెలుగులో రాగా విజయాలు అత్యధికంగా సాధించినవి మాత్రం హిందీలోనే. బాలీవుడ్ లో వచ్చిన బయోపిక్ లు దాదాపుగా అన్ని కూడా బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. అయితే తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ మాత్రం అంతగా ఆడలేదు కానీ మిగతా చిత్రాలు బాగానే ఆడాయి. తాజాగా తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య బయోపిక్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

టీవీ నటుడు విజయ్ యాదవ్ ఈ దొడ్డి కొమురయ్య బయోపిక్ కు శ్రీకారం చుట్టారు. టీవీ నటుడిగా టీవీ యూనియన్ నాయకుడిగా విశేష ప్రాచుర్యం పొందిన వ్యక్తి విజయ్ యాదవ్. దాంతో ప్రతిష్టాత్మకంగా ఈ బయోపిక్ చేయాలనే ఆలోచన చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యింది. దాంతో నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక పై దృష్టి పెట్టారు విజయ్ యాదవ్. దొరని , దొరసానిని ఎదిరించి కడివెండి ప్రజలు , దొడ్డి కొమురయ్య ఎలా పోరాటం చేశారు. ఆ పోరాటంలో దొడ్డి కొమురయ్య ఎలా ప్రాణత్యాగం చేసాడు అన్న కథాంశంతో ఈ బయోపిక్ తెరకెక్కనుంది.  కరోనా మహమ్మారి వల్ల షూటింగ్ లు చేసే పరిస్థితి లేదు కాబట్టి కరోనా తగ్గిన తర్వాత ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.  

మునుపటి వ్యాసంగంటా శ్రీనివాసరావు అరెస్ట్ తప్పదా ?
తదుపరి ఆర్టికల్కరోనా నుండి కాపాడుకోవడానికి ఇలా చేయండి
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి