పెళ్లికి సిద్ధం అవుతున్న టాలీవుడ్ విలన్

0
56

టాలీవుడ్ విలన్ కబీర్ దుహన్ సింగ్ పెళ్లికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. సింగర్ డాలీ సిద్దుని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు. 2020 కరోనా ఇయర్ గా చెప్పబడుతుండగా అదే సమయంలో కొంతమంది సెలబ్రిటీల పెళ్లిళ్ల సంవత్సరంగా కూడా పిలవబడుతోంది. ఎందుకంటే ఇప్పటికే పలువురు టాలీవుడ్ హీరోలు నిఖిల్ , నితిన్ పెళ్లిళ్లు చేసుకోగా హీరో రానా ఆగస్టు 8 న పెళ్లి చేసుకుంటున్నాడు. ఇక ఇటీవలే కబీర్ సింగ్ తన ప్రేయసితో వివాహ నిశ్చితార్థం చేసుకున్నాడు.

పెళ్లి మాత్రం 2021 ఏప్రిల్ లో చేసుకోవాలని అనుకున్నారట. కానీ అప్పటి వరకు ఆగే ఓపిక లేనట్లుంది అందుకే 2020 డిసెంబర్ లోనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట. పెళ్లి డిసెంబర్ లోనే చేయాలని ఇరు కుటుంబాల పెద్దలకు చెప్పారట దాంతో డిసెంబర్ లోనే మంచి ముహూర్తం చూడమని పురోహితులను కోరారట. కబీర్ సింగ్ తెలుగులో కిక్ 2 , సుప్రీమ్, జిల్ , సర్దార్ గబ్బర్ సింగ్, ఏంజెల్  తదితర చిత్రాల్లో నటించాడు. తెలుగుతో పాటుగా బాలీవుడ్ , కోలీవుడ్ లలో కూడా పలు చిత్రాల్లో విలన్ గా నటించాడు కబీర్ సింగ్.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి