వర్మ బయోపిక్ లో శృంగార సన్నివేశాలు కూడా ఉంటాయట

0
46
ram gopalvarma biopic ramo
వర్మ బయోపిక్ లో శృంగార సన్నివేశాలు కూడా ఉంటాయట

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ బయోపిక్ మూడు భాగాలుగా రూపొందనుంది. అయితే మొదటి భాగం అలాగే రెండో భాగంలో ఇతర నటీనటులు నటిస్తుండగా మూడో భాగంలో మాత్రం స్వయంగా రాంగోపాల్ వర్మ నటించనున్నట్లు ప్రకటించారు. ఇక మూడో భాగంలో పలువురు భామలతో శృంగారంలో పాల్గొన్న దృశ్యాలు కూడా ఉంటాయని నొక్కి వక్కాణిస్తున్నాడు వర్మ. నా నగ్న జీవితాన్ని చూపిస్తాం అంటూ కుండబద్దలు కొట్టాడు వర్మ. వోడ్కా అంటే వర్మ , వర్మ అంటే వోడ్కా అలాగే అమ్మాయిలు విలాసవంతమైన జీవితం కాబట్టి ఇందుకు సంబంధించిన సన్నివేశాలు కూడా ఉండనున్నాయట.

ఇక ఇక ఈ మూడో భాగమే ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకోవచ్చు ఎందుకంటే ఇందులో శృంగార సన్నివేశాలు ఉంటాయి కదా ! అని అంటున్నాడు వర్మ. ఇటీవల కాలంలో రాంగోపాల్ వర్మ పై పలు చిత్రాలు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని చిత్రాలు రాగా మరికొన్ని చిత్రీకరణ దశలో ఉన్నాయి. వాళ్ళు వీళ్లు తీయడం ఏంటి ? నా జీవితంలో జరిగిన ముఖ్య ఘట్టాలను నేనే చూపిస్తా అని సవాల్ చేస్తున్నాడు వర్మ.

ఎంతైనా వర్మ వర్మే ……. ఎందుకంటే ఎవరైనా తన గొప్పతనం గురించి సినిమా తీయాలనుకుంటారు కానీ వర్మ మాత్రం తనని తాను విమర్శించుకుంటూ అలాగే పొగుడుకుంటూ సినిమా తీస్తున్నాడంటే గొప్ప విషయమే. ఇతరుల వ్యక్తిగత జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తూ సొమ్ము చేసుకుంటున్న వర్మకు తన బయోపిక్ కూడా మంచి కాసుల వర్షం కురిపించేలా కనబడుతోంది. ఇన్నాళ్లు దర్శకుడి గానే ఉన్న వర్మ పవర్ స్టార్ సినిమాతో నటుడిగా కూడా మారాడు. ఇక ఇప్పుడేమో తన బయోపిక్ లోనే నటిస్తున్నాడు.

మునుపటి వ్యాసంపూరి జగన్నాథ్ పై నిప్పులు కక్కుతున్న దళిత సంఘాలు
తదుపరి ఆర్టికల్ వైల్డ్ డాగ్ గా వస్తున్న 61 ఏళ్ల మన్మథుడు నాగార్జున
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి