సంచలనం సృష్టించిన మహేష్ బాబు డిజాస్టర్ సినిమా

0
27
mahesh babu
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన డిజాస్టర్ సినిమా హిందీలో మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. తెలుగులో అట్టర్ ప్లాప్ అయిన ఆ సినిమా హిందీలో మాత్రం బ్లాక్ బస్టర్ కావడం ఏంటి ? అని షాక్ అవుతున్నారు. అసలు విషయానికి వస్తే మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఆగడు. 2014 లో విడుదలైన ఈ చిత్రంపై అంచనాలు స్కై లెవల్లో ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో ఆగడు విఫలం అయ్యింది. అంతేకాదు మహేష్ బాబు కెరీర్ లోనే ఘోర పరాజయం పొందిన చిత్రంగా నిలిచింది ఆగడు.

ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడానికి కారణం ఏంటో తెలుసా……. ఇదే కాంబినేషన్ లో అంతకుముందు దూకుడు చిత్రం రావడమే. అప్పట్లో దూకుడు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది దాంతో ఆగడు చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కట్ చేస్తే సినిమా విడుదలై డిజాస్టర్ అయ్యింది. అయితే ఇదే చిత్రాన్ని హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో పెడితే ఏకంగా 500 మిలియన్ల వ్యూస్ సాధించింది. 500 మిలియన్ల వ్యూస్ అంటే మాములు విషయం కాదు. ఇంతటి ప్రభంజనం సృష్టించిన హిందీ చిత్రం ఒక విశిష్టత సాధించింది. ఒక అట్టర్ ప్లాప్ చిత్రం ఇంతటి సంచలనం సృష్టించిన దాఖలాలు అంతగా లేవు. దాంతో ఈ అరుదైన ఘనత మహేష్ బాబు ప్లాప్ సినిమాతో సొంతం చేసుకోవడం విశేషం.

తాజాగా మహేష్ బాబు సర్కారు వారి పాట అనే చిత్రంలో నటించడానికి సిద్ధంగా ఉన్నాడు. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ , అనన్య పాండే లను హీరోయిన్ లుగా తీసుకున్నారు. కరోనా ఉధృతి తగ్గిన తర్వాత సర్కారు వారి పాట చిత్రం షూటింగ్ లో పాల్గొననున్నాడు మహేష్ బాబు. సర్కారు వారి పాట మోషన్ పోస్టర్ ని మహేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు. ఆ మోషన్ పోస్టర్ కు విశేష స్పందన వచ్చింది దాంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి