కాపాడండి అంటూ వేడుకుంటున్న సీనియర్ నటి

0
57

 

కరోనా సోకింది నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు …….. నన్ను కాపాడండి అంటూ వేడుకుంటోంది సీనియర్ నటి శివపార్వతి. టాలీవుడ్ లో పలు చిత్రాల్లో అత్తగా , అమ్మగా , బామ్మగా పలు రకాల పాత్రలను పోషించింది శివపార్వతి. తెలుగులో వందలాది చిత్రాల్లో నటించిన ఈ సీనియర్ నటి తాజాగా కరోనా బారిన పడింది. సినిమాలతో పాటుగా సీరియల్ లలో కూడా నటిస్తోంది. అయితే కరోనాతో ఆసుపత్రిలో చేరింది. వెంటిలేటర్ పై ఉంది శివపార్వతి. కరోనాతో బాధపడుతున్న తనని ఎవరూ సరిగ్గా పట్టించుకోవడం లేదని కాపాడాలంటూ వేడుకుంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది.

శివపార్వతి పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు తనని ఎవరూ పట్టించుకోవడం లేదని , ఈటివి ప్రభాకర్ గా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ సైతం నన్ను పట్టించుకోవడం లేదని అతడి వదినమ్మ సీరియల్ లో నటిస్తున్నాని తెలిపింది. జీవిత , రాజశేఖర్ లు మాత్రమే నాకు కొంతవరకు సహాయం చేసారని ఫిలిం ఇండస్ట్రీ నుండి ఎవరూ నన్ను పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపిస్తోంది సీనియర్ నటి శివపార్వతి.

టాలీవుడ్ లో పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా సింగర్ సునీత కు కూడా కరోనా సోకిందని తెలిపింది. అయితే తనకు కరోనా తగ్గిందని ఓ వీడియో విడుదల చేసింది. అలాగే మరో సింగర్ మాళవికకు కూడా కరోనా సోకిందట. దాంతో టాలీవుడ్ లో కరోనా భయం పట్టుకుంది పలువురికి. అందుకే షూటింగ్ లకు వెళ్లడం లేదు అయితే కొంతమంది మాత్రం ధైర్యం చేసి జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లలో పాల్గొంటున్నారు.

మునుపటి వ్యాసంసల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర
తదుపరి ఆర్టికల్పుకార్లను ఖండించిన డైరెక్టర్ క్రిష్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి