అదే జరిగితే మెగా ఫ్యాన్స్ కు పండగే

0
25
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటిస్తే చూడాలని మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఆశగా ఎదురుచూస్తున్నారు దాంతో మెగా ఫ్యాన్స్ కోరిక తీర్చాలని కంకణం కట్టుకున్నాడట దర్శకుడు క్రిష్. తాజాగా క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ విరూపాక్ష అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమా కొంత షూటింగ్ కూడా అయింది. అదే సినిమాలో ఓ చిన్న పవర్ ఫుల్ రోల్ ఉందట. ఆ పాత్రలో రాంచరణ్ నటిస్తే బాగుంటుందని క్రిష్ భావించాడట. చరణ్ కనుక అంగీకరిస్తే మెగా ఫ్యాన్స్ కు పండగే అని చెప్పాలి.

మొఘల్ సామ్రాజ్యం నాటి కథతో ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గజదొంగ పాత్రలో నటిస్తున్నాడు. రాబిన్ హుడ్ తరహా పాత్ర కావడంతో ఈ చిత్రం చేస్తున్నాడట. ఇప్పటికే ఈ సినిమా ఎప్పుడో కంప్లీట్ అయ్యేది కానీ కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండటంతో షూటింగ్ ఆగిపోయింది. ఇక ఈ యేడాది షూటింగ్ కష్టమే అని తెలుస్తోంది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత మాత్రమే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.  

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి