మహేష్ బాబుని భయపెట్టిన సినిమా

0
39
mahesh babu super star

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్–  “ద సోషల్ డిలేమా” అనే హర్రర్ సినిమా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని భయపెట్టిందట. ఈ విషయాన్ని మహేష్ బాబు స్వయంగా ట్వీట్ చేయడం విశేషం. లాక్ డౌన్ నేపథ్యంలో మహేష్ బాబు ఈ సినిమా చూసాడట. ఇప్పటి వరకు ఎన్నో హర్రర్ సినిమాలు చూశానని , కానీ ఇంతగా భయపెట్టిన సినిమా మాత్రం మరొకటి లేదని అంటున్నాడు మహేష్ బాబు. నిన్న రాత్రి మహేష్ బాబు ఈ ట్వీట్ చేసాడు. సోషల్ డిలేమా అనే సినిమా ఇంతగా భయపెట్టిందంటే ఆ సినిమా మరింతగా సంచలనం సృష్టించడం ఖాయం ఎందుకంటే మహేష్ అభిమానులు ఈ సినిమాని చూడటం కోసం ఎగబడటం ఖాయం. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఉంది.

లాక్ డౌన్ పుణ్యమా అని ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లకు బాగా కలిసి వచ్చింది. అలాగే ఓటీటీ లకు ఆదరణ కూడా పెరిగింది. కరోనా భయంతో బయటకు వెళ్లాలంటే భయపడుతున్న ప్రజలకు చేతిలోనే స్మార్ట్ ఫోన్ లో ఓటీటీ లో చిత్రాలను చూస్తున్నారు. అలాగే ఇంట్లో హోమ్ థియేటర్ , టీవీ లలో పలు చిత్రాలను చూస్తూ సమయం గడిచేలా చేస్తున్నారు. మిగతా వాళ్ళ లాగే మహేష్ బాబు కూడా ఓటీటీ లకు అలవాటు పడ్డాడు. దాంతో పలు చిత్రాలను చూసాడట. అయితే సోషల్ డిలేమా అనే హర్రర్ సినిమా మాత్రం మహేష్ ని వెంటాడుతూనే ఉందట.

ఇక మహేష్ బాబు కొత్త సినిమా విషయానికి వస్తే…… సర్కారు వారి పాట అనే చిత్రాన్ని పరశురాం దర్శకత్వంలో చేస్తున్నాడు మహేష్ బాబు. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఎత్తున బ్యాంక్ సెట్ వేశారు. అందులో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కొంత భాగం అమెరికాలో షూటింగ్ జరుపుకోనుంది. ఇందుకోసం చిత్ర యూనిట్ కు వీసాల కోసం అప్లయ్ చేశారు కూడా. మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటించనుంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి