ఎం ఎల్ ఏ  ఆడియో క్లిప్ సంచలనం సృష్టిస్తోంది

0
41
undavalli sreedevi mla

టాలీవుడ్ మూవీ న్యూస్,విజయవాడ-ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి ఆడియో క్లిప్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఓ పోలీస్ అధికారి మీద ఎం ఎల్ ఏ ఆగ్రహించిన తీరుకి అందరూ షాక్ అవుతున్నారు. ఓ మహిళా శాసన సభ్యురాలు అయి ఉండి ఇలా ఓ పోలీస్ అధికారిని హెచ్చరించడమే కాకుండా తిట్టడం మరీ దారుణంగా ఉందని ప్రతిపక్షాలు గోల చేస్తున్నాయి. ఉండవల్లి సీఐ పై ఎం ఎల్ ఏ శ్రీదేవి వాడిన భాష దారుణంగా ఉందని , అభ్యంతరకరమైన భాష వాడిన శ్రీదేవి పై వెంటనే ముఖ్యమంత్రి జగన్ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు .

సీఐ ని బెదిరిస్తున్న ఆడియో క్లిప్ ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతోంది అలాగే సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి పై ఆగ్రహంగా ఉన్న ప్రతిపక్షాలు , ప్రత్యర్ధులు ఈ ఆడియో మరింతగా వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఇక ఈ ఆడియో క్లిప్ జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా ఉంది ఎందుకంటే ఆ ఆడియో క్లిప్ లో సదరు సీఐ చెబుతున్న దాని ప్రకారం న్యాయం అతడి వైపే ఉంది అయినప్పటికీ అతడు చెబుతున్నది మాత్రం ఎం ఎల్ ఏ వినకుండా బెదిరించడమే పనిగా పెట్టుకుంది.

నేను చెప్పిన వాళ్ళని వదలకపోతే ఎస్పీ కి డీజీపీ కి ఫోన్ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది శ్రీదేవి. అధికార పార్టీ  శాసన సభ్యురాలు వ్యవహారం ఇప్పుడు జగన్ కు తలనొప్పిగా మారింది. ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ఆగ్రహంతో ఉన్న ఓ మీడియా అయితే ఈ ఆడియో క్లిప్ ని పదేపదే వేస్తూ వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ని ఇబ్బంది పెడుతూనే ఉంది. 

మునుపటి వ్యాసండార్లింగ్ ప్రభాస్ తన అభిమానులకు గిఫ్ట్
తదుపరి ఆర్టికల్బిజినెస్ రంగంలో ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోలు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి