టాలీవుడ్ పై సంచలన ఆరోపణలు చేసిన హీరోయిన్

0
75
madhavi latha about toll wood industry

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్టాలీవుడ్ పై సంచలన ఆరోపణలు చేసింది హీరోయిన్ మాధవీ లత. బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా జరిగే పార్టీలలో డ్రగ్స్ వాడుతున్నారని సంచలన ఆరోపణలు చేసింది మాధవీలత. టాలీవుడ్ లో జరిగే పార్టీలలో ప్రముఖుల ఇళ్లల్లో డ్రగ్స్ వాడకం ఉంటుందని అది ఇప్పటి నుండి కాదని 2009 నుండే ఈ సంస్కృతి ఉందని టాలీవుడ్ పై నిందలు వేస్తోంది మాధవీ లత. నచ్చావులే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. మొదటి చిత్రమే పెద్ద హిట్ అయ్యింది.

అయితే ఆ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కలేదు పాపం ఈ భామకు. దాంతో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా మరికొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ లు వేసింది. మహేష్ బాబు హీరోగా నటించిన అతిథి చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది. ఆ సినిమాలో నటించిన సమయంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి తిట్టాడని ఆరోపించింది మాధవీ లత. కట్ చేస్తే గతకొంత కాలంగా ఈ భామ సినిమాల్లో నటించడం లేదు. భారతీయ జనతా పార్టీలో చేరి పలు కార్యక్రమాల్లో పాల్గొంటోంది.

ఇక కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు అప్పట్లో పెద్దగానే చేసింది ఈ భామ అయితే వాటిని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు పాపం దాంతో సైలెంట్ అయిపోయింది. ఇక ఇప్పుడేమో డ్రగ్స్ వాడకం గురించి మాట్లాడుతోంది. బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా డ్రగ్స్ వాడకం ఉందని కాకపోతే అన్నీ పెద్ద తలకాయలు కాబట్టి అంతా బయటకు రావడం డౌట్ అని అంటోంది మాధవీ లత. రెండేళ్ల క్రితం డ్రగ్స్ రాకెట్ అంటూ పలువురు టాలీవుడ్ ప్రముఖులను విచారణ పేరుతో పిలిపించి పెద్ద హంగామే నడిచింది. కట్ చేస్తే ఆ కేసు ఏమైందో అందరికీ తెలిసిందే.

మునుపటి వ్యాసంషాకింగ్ ట్రీట్ ఇస్తున్న పవన్ కల్యాణ్
తదుపరి ఆర్టికల్విడాకులు తీసుకున్న టాలీవుడ్ జంట
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి