భారీ  రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న హీరోయిన్

0
59

అసలే కరోనా సమయం రా బాబూ అని దర్శక నిర్మాతలు తలపట్టుకుంటుంటే హీరోయిన్ పూజా హెగ్డే మాత్రం ఏకంగా 2 కోట్లు డిమాండ్ చేస్తూ దర్శక నిర్మాతలకు చుక్కలు చూపేడుతోందట. బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఒకప్పుడు ఐరన్ లెగ్ లాంటి భామ కానీ ఆమె దశ తిరిగింది. మహర్షి చిత్రంతో పాటుగా అల…. వైకుంఠపురంలో చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యేసరికి డిమాండ్ పెరిగింది. అంతేనా ఇదే సమయంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక కావడంతో ఒక్కసారిగా హాట్ కేక్ అయిపోయింది దాంతో అమాంతం రెమ్యునరేషన్ పెంచింది పూజా హెగ్డే.

తాజాగా ఈ భామ అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా 2021 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానుంది. కొంత ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. కరోనా తగ్గితే మిగతా షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఒకవైపు కరోనా వల్ల ఇబ్బందులు తలెత్తాయి కాబట్టి హీరోలు , హీరోయిన్ లు దర్శకులు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని నిర్మాతలు కోరుతుండగా పూజా హెగ్డే మాత్రం తన రెమ్యునరేషన్ ని డబుల్ చేయడం దర్శక నిర్మాతలకు ఇబ్బంది కరంగా తయారయ్యిందట.

మునుపటి వ్యాసంఆ నష్టాన్ని పూడ్చడానికి 15 సినిమాల్లో నటించాడట
తదుపరి ఆర్టికల్అప్సర రాణి అందాలతో థ్రిల్లర్ ట్రైలర్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి