కరోనా వస్తే ప్లాస్మా ఇస్తానంటున్న హీరో

0
42

నాకు కరోనా సోకితే తప్పకుండా ప్లాస్మా దానం చేస్తానని అంటున్నాడు హీరో విజయ్ దేవరకొండ. నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో సీపీ సజ్జనార్ తో కలిసి ప్లాస్మా దానం చేసిన వాళ్ళని అభినందించాడు విజయ్ దేవరకొండ. కరోనా నుండి బయటపడిన వాళ్ళు ప్లాస్మా దానం చేయడం వల్ల మరికొందరు బ్రతికే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు విజయ్ దేవరకొండ. మీరు దానం చేయడమే కాదు నాకు కరోనా వస్తే నేను కూడా ప్లాస్మా దానం చేస్తానని తెలిపారు విజయ్ దేవరకొండ.

సైబరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో ప్లాస్మా డోనర్స్ క్లబ్ ఏర్పాటు చేశారు. ప్లాస్మా దానం చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళ వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఇక ప్లాస్మా అవసరం ఉన్నవాళ్ళని గుర్తించి సకాలంలో ఇస్తామని అంటున్నారు సజ్జనార్. ఇలా కొంతమంది ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయగా కొన్ని ప్రాణాలు నిలిచాయి. అందుకే ప్లాస్మా దానం చేసిన వాళ్ళని విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందించారు సజ్జనార్ . ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే …… తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి