మహేష్ బాబు నటించిన ఆ చిత్రానికి 21 ఏళ్ళు

0
82

హీరో మహేష్ బాబు వయసు 45 ఏళ్ళు అయితే 21 ఏళ్ళు ఏంటి ? అని అనుకుంటున్నారా ? హీరోగా పరిచయం అయి 21 ఏళ్ళు అండి. బాల నటుడిగా మహేష్ బాబు చాలా చిత్రాల్లో నటించాడు కానీ 1999 లో మహేష్ బాబు సోలో హీరోగా నటించిన చిత్రం రాజకుమారుడు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అప్పటి అగ్ర నిర్మాత అశ్వనీదత్ నిర్మించిన చిత్రం ఈ రాజకుమారుడు. బొంబాయి భామ ప్రీతి జింటా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.

1999 జులై 30 న విడుదల అయ్యింది రాజకుమారుడు. హీరోగా మహేష్ బాబు మొదటి చిత్రం కావడంతో కృష్ణ అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురు చూశారు. వాళ్ళ అంచనాలకు తగ్గట్లుగానే రాజకుమారుడు మంచి విజయం సాధించింది. అప్పట్లో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో 42 కేంద్రాల్లో దిగ్విజయంగా 100 రోజులు ఆడింది రాజకుమారుడు. ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ ఈ చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ గా పవర్ ఫుల్ రోల్ చేయడం.  మహేష్ కు హీరోగా ఫస్ట్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం. సరిగ్గా 21 సంవత్సరాల క్రితం విడుదల అయిన సినిమా కావడంతో ఆ సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు మహేష్ బాబు , రాఘవేంద్రరావు, అశ్వనీదత్ అలాగే కృష్ణ , మహేష్ అభిమానులు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి