సినిమారంగంలో కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసు

0
18
sanjana ragini divedhi

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్డ్రగ్స్ కేసు సినిమారంగాన్ని అతలాకుతలం చేస్తోంది. తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ , హిందీ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో కలకలం
సృష్టిస్తున్న కేసు డ్రగ్స్ . అయితే మూడేళ్ళ క్రితం టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది డ్రగ్స్ కేసు. ఎంతటి సంచలనం అంటే ఇక డ్రగ్స్ కేసులో ఇరుకున్న హీరోలు , హీరోయిన్ లు , దర్శక నిర్మాతలు ఇతర సాంకేతిక నిపుణులు అందరు కూడా అరెస్ట్ అవ్వడం ఖాయం అనేంతగా. హీరో రవితేజ , దర్శకులు పూరి జగన్నాధ్ , హీరోయిన్ ఛార్మి , నటుడు సుబ్బరాజు , కెమెరామెన్ శ్యామ్ కె నాయుడు , తనీష్ , నందు , నవదీప్ , తరుణ్ , ముమైత్ ఖాన్ తదితరులు నోటీసులు అందుకున్నారు. అప్పట్లో ఈ తతంగం అంతా చూస్తే ఇక అరెస్ట్ తప్పదు అలాగే శిక్ష కూడా తప్పదు అని వినిపించింది.

ఇక సెకండ్ లిస్ట్ లో మరికొంతమంది టాలీవుడ్ ప్రముఖులు ఉన్నారని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. ఇక వాళ్ళ పేర్లు కూడా బయటకు రావడం ఖాయం అని అనుకుంటున్న సమయంలో సీరియల్ లాగా డ్రగ్స్ కేసు విచారణ సాగి సాగి అయిపోందనిపించారు. కట్ చేస్తే మూడేళ్లు అయిపొయింది కానీ ఇంతవరకు ఆ కేసు తేలలేదు. కట్ చేస్తే ఇపుడు బాలీవుడ్ లో అలాగే శాండల్ వుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం సృష్టించడమే కాకుండా అరెస్ట్ ల పర్వం కూడా కొనసాగుతోంది.

కన్నడంలో ఇద్దరు హీరోయిన్ లు సంజన , రాగిణి ద్వివేది లు అరెస్ట్ అయ్యారు డ్రగ్స్ కేసులో. అలాగే హిందీలో తాజాగా హీరోయిన్ రియా చక్రవర్తిని అరెస్ట్ చేసారు నార్కోటిక్స్ అధికారులు. రియా చక్రవర్తి బాలీవుడ్ ప్రముఖుల లిస్ట్ బయటపెట్టిందట. అందులో దాదాపు 25 మంది ప్రముఖులు ఉన్నారట. అయితే ఆ ప్రముఖులు అరెస్ట్ అవుతారా ? లేక టాలీవుడ్ లో లాగా సద్దుమణుగుతుందా ? అన్నది చూడాలి. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి