ఆ హీరోతో విబేధాల గురించి నోరు విప్పిన డైరెక్టర్

0
32
sv krishna reddy,rajendra prasad

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్1990 వ దశకంలో టాలీవుడ్ టాప్ హీరోలకు ధీటుగా స్టార్ డంతో రాణించిన కామెడీ కింగ్ డాక్టర్ రాజేంద్రప్రసాద్. ఈ హీరోతో పలువురు దర్శకులు సినిమాలు చేయాలనీ పోటీ పడేవాళ్ళు. అలాంటి వాళ్లలో ఎస్వీ కృష్ణారెడ్డి కూడా ఒకరు. క్లీన్ ఎంటర్ టైన్ మెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి. రాజేంద్రప్రసాద్ – ఎస్వీ కృష్ణారెడ్డి ల కాంబినేషన్ లో పలు చిత్రాలు వచ్చాయి అవన్నీ కూడా బ్లాక్ బస్టర్ లు అయ్యాయి. రాజేంద్రుడు – గజేంద్రుడు , మాయలోడు , కొబ్బరి బొండాం తదితర చిత్రాలు వచ్చాయి. కొబ్బరి బోండాం చిత్రానికి ఎస్వీ కృష్ణారెడ్డి సంగీతం మాత్రమే అందించాడు.


అయితే మాయలోడు సినిమా సమయంలో రాజేంద్రప్రసాద్ కు ఎస్వీ కృష్ణారెడ్డి కి మధ్య గొడవలు జరిగాయి. దాంతో అహం దెబ్బతిన్న ఎస్వీ నీ మీద తీయాల్సిన పాటని నీ మీద కాకుండా హాస్య నటుడు బాబు మోహన్ మీద తీస్తానని సవాల్ చేయడమే కాకుండా ఏకంగా ఆ పాటలో సౌందర్యని పెట్టి మరీ షూటింగ్ చేసాడు. ఆ సమయంలో రాజేంద్రప్రసాద్ మరింతగా ఉడుక్కున్నాడట. అయినప్పటికీ ఎస్వీ మాత్రం ఎక్కడా తగ్గకుండా బాబూమోహన్ – సౌందర్య మీద ” చినుకు చినుకు అందెలతో ” అనే బ్లాక్ బస్టర్ సాంగ్ ని చిత్రీకరించాడు. ఆ పాట బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది దాంతో ఎస్వీ కృష్ణారెడ్డి – రాజేంద్ర ప్రసాద్ ల మధ్య మరింత దూరం పెరిగింది.

కట్ చేస్తే రాజేంద్రప్రసాద్ చాలా మంచి నటుడని అందుకే అతడు ప్రధాన పాత్రలో త్వరలోనే ఓ సినిమా ప్లాన్ చేస్తున్నానని , గతంలో నాకు రాజేంద్ర ప్రసాద్ కు విబేధాలు వచ్చాయని కానీ ఇప్పుడు మామధ్య ఎలాంటి విబేధాలు లేవని , జీవితంలో కొన్ని కొన్ని అలా జరిగిపోతూనే ఉంటాయి. అలాంటి విబేధాలను పక్కన పెట్టి ముందుకు సాగడమే అంతేకాని ఆ గొడవలను మరింత పెద్దవిగా చేసుకోవడం మంచిది కాదని ఇప్పుడు మేమిద్దరం మంచి స్నేహితులమని అంటున్నాడు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. తాజాగా అలీ హోస్ట్ గా నిర్వహిస్తున్న ఓ షోలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు ఎస్వీ కృష్ణారెడ్డి. 

మునుపటి వ్యాసంఅన్నా డీఎంకే పార్టీ రెండుగా చీలనుందా ?
తదుపరి ఆర్టికల్నేహశర్మ ఫొటోస్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి