భార్య విడాకులు ఇవ్వడంతో కన్నీళ్ల పర్యంతమైన డైరెక్టర్

0
36
surya kiran director

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్ఎంతగానో ప్రేమించిన భార్య తనతో కలిసి ఉండలేనని చెప్పడమే కాకుండా తనకు విడాకులు ఇచ్చిందని కన్నీళ్ల పర్యంతం అయ్యాడు దర్శకుడు సూర్యకిరణ్. సత్యం సినిమాతో టాలీవుడ్ లో సంచలన విజయం అందుకున్నాడు సూర్యకిరణ్. బాలనటుడిగా దక్షిణాదిన పలు చిత్రాల్లో నటించిన సూర్యకిరణ్ దర్శకుడిగా ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయాడు పాపం. అయితే మొదటి సినిమా సత్యం సూపర్ హిట్ కావడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.

ఆ తర్వాత పలు చిత్రాలకు దర్శకత్వం వహించాడు సూర్యకిరణ్ అయితే ఆ సినిమాలు అంతగా ఆడలేదు. ఈలోపు హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం ఈ ఇద్దరి కాపురం సజావుగానే సాగింది కానీ ఓ సొంత సినిమా ప్లాన్ చేసి దెబ్బతిన్నారు. ఆ సినిమా విడుదల చేయడానికి చాలా కష్టాలు పడ్డారు సూర్యకిరణ్ – కళ్యాణి. ఇక ఈ సినిమా విడుదల అయినా విజయం మాత్రం సాధించలేదు దాంతో ఆర్ధికంగా బాగా దెబ్బతిన్నారు.

అసలే విజయాలు లేవు ఆపై ఆర్ధిక ఇబ్బందులు దాంతో కళ్యాణి – సూర్యకిరణ్ ల మధ్య తీవ్ర విబేధాలు నెలకొన్నాయి దాంతో విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్నప్పటికీ తనకు కళ్యాణి అంటే ఇష్టమని కానీ కళ్యాణికి మాత్రం నేనంటే ఇష్టం లేకపోయిందని కుమిలిపోతున్నాడు సూర్యకిరణ్. ఇటీవల బిగ్ బాస్ 4 సీజన్ లోకి అడుగుపెట్టిన సూర్యకిరణ్ పట్టుమని పది రోజులు కూడా ఉండలేకపోయాడు. మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యాడు దాంతో పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు అలాగే తన బాధని వ్యక్తం చేస్తున్నాడు. అయితే 2 స్క్రిప్ట్ లను సిద్ధం చేసుకున్నానని త్వరలోనే షూటింగ్ చేయడానికి రెడీ అవుతున్నానని అంటున్నాడు సూర్యకిరణ్. 

మునుపటి వ్యాసంఆ కష్టాలు పడలేక నెంబర్ మార్చిన సమంత
తదుపరి ఆర్టికల్కరీంనగర్ లో బిక్షాటన చేసిన షకలక శంకర్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి