హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ ఇన్ స్పెక్టర్ పై కేసు పెట్టిన నటి

0
61

నటి శ్రీ సుధ అలియాస్ సాయి సుధ ఎస్సార్ నగర్ ఇన్ స్పెక్టర్ పై కేసు పెట్టింది. హీరో సందీప్ కిషన్ మేనమామ అయిన కెమెరామెన్ శ్యామ్ కె నాయుడు తనని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి కొన్నాళ్ళు సహజీవనం చేసి ఇప్పుడేమో పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని పోలీసులను ఆశ్రయించింది సాయి సుధ. అయితే ఆ కేసులో ఎస్సార్ నగర్ ఇన్ స్పెక్టర్ నన్ను తప్పు దోవ పట్టించాడని , శ్యామ్ కె నాయుడు బెయిల్ మీద రావడానికి ఇన్ స్పెక్టర్ కారణమని , అలాగే నా దగ్గర కూడా కొంత డబ్బు తీసుకున్నాడని ఆరోపిస్తూ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసింది.

ఇన్ స్పెక్టర్ పై ఫిర్యాదు చేయడమే కాకుండా అతడు మాట్లాడినప్పుడు రికార్డ్ చేసిన ఆధారాలు కూడా ఏసీబీ అధికారులకు అందించిందట. బెయిల్ పై నేను సంతకం చేయలేదు అయినప్పటికీ నా సంతకాన్ని ఫోర్జరీ చేసారని అందుకు ఇన్ స్పెక్టర్ మురళీ కృష్ణ కారకుడని అంటోంది సాయి సుధ. ఫిర్యాదు తో పాటుగా కొన్ని ఆధారాలు కూడా ఇవ్వడంతో కేసు నమోదు  చేసుకున్న ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తామని తెలిపారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి