తెలుగు బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ వీళ్ళే నట

0
60
nagarjuna bigboss 4

బిగ్ బాస్ హిందీలోనే కాదు తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. వరుసగా మూడు సిరీస్ లను పూర్తి చేసుకొని ఇప్పుడు నాల్గవ సీజన్ కు రెడీ అయ్యింది. కరోనా మహమ్మారి లేకపోతే బిగ్ బాస్ 4 రసవత్తరంగా సాగేది ఈపాటికి. కరోనా వల్ల ఆలస్యం అయ్యింది అలాగే టాస్క్ లు కూడా మారుతున్నాయని తెలుస్తోంది. బిగ్ బాస్ 4 లోకి ఎంటర్ అయ్యేవాళ్ళకు ముందుగా కరోనా టెస్ట్ లు చేసి ఆ తర్వాత పూర్తిగా ఫిట్ గా ఉన్నారు అని అనుకున్నాకే లోపలకు పంపించనున్నారు. ఇప్పటికే పార్టిసిపేట్ చేసేవాళ్లకు కరోనా టెస్ట్ లు నిర్వహించారట.

ఇక తెలుగు బిగ్ బాస్ 4 సీజన్ లో పాల్గొనే పోటీదారులు వీళ్ళే అని తెలుస్తోంది. ప్రస్తుతం వినబడుతున్న పేర్ల ప్రకారం క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి , బుల్లితెర నటి సమీరా , సింగర్ , నటుడు నోయెల్ , ఇటీవల పలు సూపర్ హిట్ పాటలతో సంచలనం సృష్టిస్తున్న మంగ్లీ , నటుడు నందు , మరో యంగ్ హీరో సుధాకర్ కొమ్మాకుల ( లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరో ) యూట్యూబ్ లో ఫేమస్ అయిన మహబూబ్  షేక్, హారిక , బుల్లితెర నటుడు సయ్యద్ సోహైల్ తో పాటుగా తెలుగులో రెండు మూడు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన మోనాల్ గజ్జర్ కూడా ఉందట. అయితే ఈ పది మందితో పాటుగా మరో నలుగురు కూడా బిగ్ బాస్ 4 సీజన్ లో పాల్గొననున్నారు.

ఇక బిగ్ బాస్ 4 సీజన్ కు కూడా కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. మూడో సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించి సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యేలా చేసిన నాగార్జున మరోసారి బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. బిగ్ బాస్ మొదటి సీజన్ కు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించి సూపర్ సక్సెస్ చేసాడు. ఆ తర్వాత రెండో సీజన్ కు నాని హోస్ట్ గా చేసాడు. రెండో సీజన్ కూడా సక్సెస్ అయ్యింది. అయితే కొన్ని వివాదాలు కూడా చుట్టుముట్టాయి. ఇక మూడో సీజన్ కు కింగ్ అడుగు పెట్టాడు. ఇప్పుడు నాలుగో సీజన్ కూడా చేస్తున్నాడు.  

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి