తెలంగాణలో మరో శాసనసభ్యుడికి కరోనా

0
65
TMN logo
TMN logo

తెలంగాణ రాష్ట్రంలో శాసన సభ్యులకు కరోనా సోకుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడగా తాజాగా ఆ జాబితాలోకి ఇబ్రహీంపట్నం ఎం ఎల్ ఏ మంచిరెడ్డి కిషన్ రెడ్డి కూడా చేరారు. మంచి రెడ్డి కిషన్ రెడ్డి కి మూడు , నాలుగు రోజులుగా జలుబు , దగ్గు , జ్వరం వస్తుండటంతో కరోనా టెస్ట్ చేశారు. ఫలితాల్లో పాజిటివ్ అని తేలడంతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరాడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. అలాగే మంచిరెడ్డి డ్రైవర్ , గన్ మెన్ లతో పాటుగా ఇతర సిబ్బందికి కూడా కరోనా టెస్ట్ లు నిర్వహించగా అందులో కూడా కొంతమందికి కరోనా సోకడంతో కొంతమందిని హోం ఐసోలేషన్ కు తరలించారు అలాగే అవసరం ఉన్న వాళ్ళని గాంధీకి తరలించారు.

మంచిరెడ్డి కిషన్ రెడ్డికి కరోనా సోకిందన్న విషయం తెలియడంతో ఎం ఎల్ ఏ ని ఇటీవల కలిసిన వాళ్ళు నిలువెల్లా వణికిపోతున్నారు. ఇక అధికారులు అటువంటి వాళ్ళని పట్టుకునే పనిలో ఉన్నారు. ఎం ఎల్ ఏ ని కలిసిన వాళ్ళ లిస్ట్ రెడీ చేసి వాళ్ళని అప్రమత్తం చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముత్తిరెడ్డి యాదగిరి , వివేకానంద గౌడ్ , బాజిరెడ్డి గోవర్ధన్ , గణేష్ గుప్తా బిగాల , కడియం శ్రీహరి, పద్మారావు , మహమూద్ అలీ , మంచిరెడ్డి కిషన్ రెడ్డి లతో పాటుగా పలువురు కరోనా బారిన పడ్డారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి