ష్…. స్టోరీస్ లో ఫుల్లుగా రొమాన్స్ అంట

0
47
teja

దర్శకుడు తేజ తన రూటు మార్చాడు. ష్….. స్టోరీస్ అంటూ వెబ్ సిరీస్ మొదలు పెట్టాడు. కాగా ఈ వెబ్ సిరీస్ లో ఫుల్లుగా రొమాన్స్ ఉంటుందట. ఎక్కువ సన్నివేశాలు యువతని ఆకట్టుకునేలా యమా రొమాంటిక్ గా తీసారట. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో ప్రసారం కానుంది. ఆ వెబ్ సిరీస్ చిత్రీకరిస్తున్న సమయంలోనే కరోనా బారిన పడ్డాడు దర్శకుడు తేజ. ఇన్నాళ్లు ప్రేమ కథా చిత్రాలను తీసిన తేజ ఒక్కసారిగా తన రూటు మార్చి గురువు రాంగోపాల్ వర్మ లాగా అడల్ట్ కంటెంట్ తో వెబ్ సిరీస్ లకు శ్రీకారం చుట్టాడు. కరోనా సమయంలో షూటింగ్ లన్నీ ఆగిపోయాయి అలాగే థియేటర్ లు కూడా మూతబడ్డాయి దాంతో ఇలా వెబ్ సిరీస్ లలోకి వచ్చాడు తేజ.

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విభిన్న కథా చిత్రాలతో పాటుగా రొమాంటిక్ వెబ్ సిరీస్ కు మంచి ఆదరణ లభిస్తోంది దాంతో ఎక్కువమంది అడల్ట్ కంటెంట్ తో వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నారు. ఇక తేజ కు వెబ్ సిరీస్ చేయాలని ఆహ్వానం అందడంతో ష్…… స్టోరీస్ అనే అడల్ట్ కంటెంట్ వెబ్ సిరీస్ చేసాడు. ఇంతకుముందు తేజ తీసిన చిత్రాల్లో ప్రేమ తో పాటుగా కాస్త రొమాన్స్ కూడా ఎక్కువగానే ఉండేది అయితే ఇప్పుడు మాత్రం లవ్ కంటే లస్ట్ ఎక్కువగా ఉంటుందని వినిపిస్తోంది. మొత్తానికి కరోనా కష్టాల వల్ల థియేటర్లు మూతబడినప్పటికి ఓటీటీ రూపంలో మంచే జరుగుతోంది దర్శక నిర్మాతలకు.

మునుపటి వ్యాసంNaina Ganguly “Johar” movie Actress
తదుపరి ఆర్టికల్తెరపైకి దాసరి బయోపిక్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి