మహేష్ ఫ్యాన్స్ పై కేసు పెట్టిన తరుణ్ భాస్కర్

0
15

పెళ్లిచూపులు డైరెక్టర్ దాస్యం తరుణ్ భాస్కర్ మహేష్ బాబు ఫ్యాన్స్ పై కేసు పెట్టాడు. తరుణ్ భాస్కర్ కు మహేష్ బాబు ఫ్యాన్స్ కు గొడవ ఎందుకు వచ్చిందంటే …… మలయాళ సినిమా చూసిన తరుణ్ భాస్కర్ ఆ సినిమా గొప్పతనం గురించి చెప్పే క్రమంలో మన తెలుగు సినిమాలో అయితే చివరకు కొన్ని సందేశాత్మక డైలాగ్స్ పెట్టి కమర్షియల్ చిత్రంగా మలిచేవాళ్ళు అని మాత్రమే అన్నాడు. అయితే అది మా హీరోని మాత్రమే అన్నారని భావించి తరుణ్ భాస్కర్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

తనని అదేపనిగా ట్రోల్ చేస్తున్న వాళ్ళని పిలిచి మీ పద్ధతి సరైంది కాదు అని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడట దర్శకుడు తరుణ్ భాస్కర్. అయితే అతడు ఎంతగా సర్దిచెప్పాలని చూసినా వాళ్ల ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో పాటుగా అదేపనిగా విమర్శలు గుప్పిస్తుండటంతో చేసేదిలేక తనదగ్గర ఉన్న అన్ని ఆధారాలతో సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు తరుణ్ భాస్కర్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లిచూపులు చిత్రం తర్వాత ఈ నగరానికి ఏమైంది అనే చిత్రం చేసాడు తరుణ్ భాస్కర్. ఇక ఇప్పుడేమో వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నాడు.  

 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి