తమన్నా , కోహ్లీ లను అరెస్ట్ చేయాలంటున్న లాయర్

0
62
kohili cricketer

హీరోయిన్ తమన్నా , భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ లను తక్షణమే అరెస్ట్ చేయాలని అంటున్నాడు తమిళనాడు కు చెందిన న్యాయవాది. యువతను  గ్యాంబ్లింగ్ ఆట వైపు మళ్లించేలా ఈ ఇద్దరూ ప్రకటనలలో నటించారని , దాని వల్ల దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున యువత గ్యాంబ్లింగ్ కు పాల్పడుతోందని దీనివల్ల చాలా కాపురాలు కూలుతున్నాయని , మరికొంతమంది అప్పుల పాలై ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేసాడు. అంతేకాదు మద్రాస్ హైకోర్టు లో పిల్ కూడా వేసాడు. రాబోయే మంగళవారం ఈ పిటీషన్ విచారణకు రానుంది.

మిల్కీబ్యూటీ తమన్నా విరాట్ కోహ్లీ తో కలిసి గ్యాంబ్లింగ్ యాడ్ లో నటించింది. ఇలా ఆన్ లైన్ లో ఆడటం వల్ల వేలల్లో , లక్షల్లో డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పడం వల్ల దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున యువత ఈ ఆన్ లైన్ ఆటలు ఆడుతూ లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. పెద్ద మొత్తంలో అప్పులు చేస్తూ దివాళా తీస్తున్నారు. ఇక కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు భారతదేశంలో చాలా చోట్ల జరిగాయి. అయితే తమిళనాడు లో ఇంకా ఎక్కువ జరిగాయట దాంతో మద్రాస్ హైకోర్టు ని ఆశ్రయించాడు ఓ లాయర్. అంతేకాదు గ్యాంబ్లింగ్ ఆడమని ప్రోత్సహిస్తున్న తమన్నా , విరాట్ కోహ్లీ లను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాడు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి