గుండెపోటుతో మరణించిన నటుడు

0
16

గుండెపోటుతో తమిళ యువ నటుడు సేతు రామన్ (36 ) మరణించాడు. సంచలనం సృష్టించిన సంఘటన నిన్న రాత్రి చెన్నై లో జరిగింది. సేతురామన్ కు గుండెపోటు రాగానే వెంటనే ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సేతురామన్ మరణించినట్లుగా ప్రకటించారు డాక్టర్లు. దాంతో సేతురామన్ సన్నిహితులు తీవ్ర దుఃఖసాగరంలో మునిగారు. సేతురామన్ కు ఒక భార్య ఒక కూతురు ఉన్నారు.

స్కిన్ స్పెషలిస్ట్ కూడా అయిన సేతురామన్ కు నటన అంటే ఇష్టం ఉండటంతో పలు చిత్రాల్లో నటించాడు. కన్నా లడ్డు తిన్నా ఆశయ్య అనే తమిళ చిత్రంతో నటుడిగా పరిచయం అయ్యాడు సేతురామన్. సినిమా తర్వాత తమిళంలో పలు చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రముఖ హాస్య నటుడు సంతానం కు అత్యంత సన్నిహితుడు సేతురామన్. చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడంతో తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు సేతురామన్ సన్నిహితులు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి