ఆ పాత్రలో తమన్నానా ?

0
45
tamanna bhatiah

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్టాలీవుడ్ ప్రేక్షకులను షాక్ కి గురయ్యేలా చేస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. బాలీవుడ్ లో విజయం సాధించిన అందా ధూన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే. కాగా ఆ సినిమాలో సీనియర్ నటి టబు పోషించిన అడల్ట్ పాత్రని తెలుగులో తమన్నా పోషించడానికి ఒప్పుకుంది దాంతో అఫీషియల్ గా ఈ విషయాన్ని ప్రకటించారు దర్శక నిర్మాతలు. నితిన్ హీరోగా నటించనున్న ఈ రీమేక్ చిత్రంలో హీరోయిన్ గా హాట్ భామ నభా నటేష్ నటించనుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నితిన్ సోదరి నిఖితా రెడ్డి నిర్మిస్తోంది.


అయితే టబు పోషించిన పాత్ర కోసం టబు తో పాటుగా రమ్యకృష్ణ , నయనతార , శ్రియా శరన్ , ప్రియమణి తదితర హీరోయిన్ లను సంప్రదించారట దర్శక నిర్మాతలు అయితే కొంత రెమ్యూనరేషన్ తో పాటుగా ఇతర ఇబ్బందుల దృష్ట్యా ఇప్పుడు ఆ స్థానంలో తమన్నాని ఎంపిక చేశారట. ఇక తమన్నా కూడా ఈ ఛాలెంజింగ్ రోల్ ని చేయడానికి అంగీకరించడం పెద్ద చర్చకు దారి తీసింది ఎందుకంటే హీరోయిన్ గా పదేళ్లుగా రాణిస్తున్న తమన్నా కాస్త అడల్ట్ ఛాయలున్న పాత్రని తొలిసారిగా చేయనుంది. గతకొంత కాలంగా తమన్నాకు సరైన అవకాశాలు లేకుండాపోయాయి దాంతో ఈ పాత్రని చేయడానికి ఒప్పుకుందేమో అన్న అనుమానం వక్తం అవుతోంది.

నితిన్ భీష్మ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చేస్తున్న చిత్రం ఇది. రంగ్ దే అనే చిత్రం పూర్తి చేయాల్సి ఉంది దాన్ని కంప్లీట్ చేసాక నవంబర్ నుండి ఈ రీమేక్ చిత్రం పట్టాలెక్కనుంది. హిందీలో విజయం సాధించిన అందా ధూన్ తో టబుకి చాలా మంచి పేరు వచ్చింది , మరి తెలుగులో తమన్నా కు అలాంటి పేరు వస్తుందా ? లేక ఇలాంటి పాత్రని ఎందుకు ఒప్పుకుంది ? అనే మాట వస్తుందా ? అన్నది తెలియాలంటే ఈ సినిమా విడుదల అయితే కానీ తెలీదు. 

మునుపటి వ్యాసంబిజినెస్ రంగంలో ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోలు
తదుపరి ఆర్టికల్సమంత పాత్రని తన్నుకుపోయిన ఐశ్వర్య
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి