భట్టికి గట్టిగా కౌంటర్ ఇచ్చిన తలసాని

0
53
srinivas yadav counter to bhatti

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్తెలంగాణ ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క కు గట్టిగా కౌంటర్ ఇచ్చాడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఒక ప్రతిపక్ష నేత ఇంటికి మంత్రి స్వయంగా వెళ్లి ఆహ్వానించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళని చూపించిన దాఖలాలు లేవు కానీ నేను స్వయంగా భట్టి ఇంటికి వెళ్లి నా కారులో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చూపించాను. సామాన్య ప్రజలు ఆత్మగౌరవంతో బ్రతికేలా అద్భుతంగా తీర్చిదిద్దిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చూసి భట్టి విక్రమార్కతో పాటుగా కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని అందుకే ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.


హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కేవలం 5 చోట్ల మాత్రమే భట్టి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చూసాడు. ఇంకా చాలా చోట్ల కడుతున్నాం. కొన్ని పూర్తి అయ్యాయి అలాగే మరికొన్ని చివరి దశలో ఉన్నాయి మొత్తంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ప్రభుత్వం కడుతోందని వాటిని త్వరలోనే పూర్తి చేసి పేదలకు అందజేస్తామని స్పష్టం చేసాడు తలసాని. లక్ష ఇల్లు ఒకే చోట ఎక్కడైనా కడతారా ? అయినా మేము పారిపోవడం ఏంటి ? పారిపోయామని భట్టి ఎలా నిందలేస్తాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడు తలసాని.

అసెంబ్లీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పై జరిగిన చర్చ లో సవాళ్లు ప్రతి సవాళ్లు జరుగగా లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇల్లు చూపిస్తామని ఛాలెంజ్ చేసాడు మంత్రి తలసాని. ఛాలెంజ్ ని భట్టి స్వీకరించడంతో రెండు రోజులు హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళని చూపించాడు. అయితే మధ్యలోనే తమకు ఇతర పనులు ఉన్నాయని చెప్పి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో పాటుగా మేయర్ బొంతు రామ్మోహన్ వెళ్లిపోయారు దాంతో భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు. 

మునుపటి వ్యాసంతాప్సీ స్థానంలో అనుష్క
తదుపరి ఆర్టికల్వెబ్ సిరీస్ లో నటిస్తున్న రేణు దేశాయ్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి