తమన్నా ఇంట కరోనా కలకలం

0
56
ta manna

 

మిల్కీ బ్యూటీ తమన్నా ఇంట కరోనా కలకలం చెలరేగింది. తమన్నా తల్లిదండ్రులు ఇద్దరికి కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని తమన్నా స్వయంగా వెల్లడించింది. వారం రోజులుగా మా తల్లిదండ్రులు ఇద్దరికి కూడా కొంత నలతగా ఉండింది దాంతో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో ఎందుకైనా మంచిదని కరోనా టెస్ట్ లు చేయించారట. ఆ రిపోర్ట్ రావడంతో షాక్ అయ్యింది తమన్నా. ఎందుకంటే తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో తమన్నా తో పాటుగా మిగతా వాళ్ళు కూడా టెస్ట్ చేయించుకోగా తమన్నాతో పాటుగా మిగతవాళ్ళకు నెగెటివ్ అని వచ్చిందట.

అయితే తన తల్లిదండ్రులకు కరోనా టెస్ట్ పాజిటివ్ అని రావడంతో తమన్నా కన్నీళ్ల పర్యంతం అయ్యిందట. తన కళ్ళ ముందే ఉన్న తల్లిదండ్రులను కలవలెను, ముట్టుకోలేను అని ఏడ్చిందట పాపం తమన్నా. తల్లిదండ్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా తమన్నా తో పాటుగా మిగతా కుటుంబ సభ్యులు మాత్రం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండనుంది తమన్నా. ఈ రెండు వారాలు తమన్నా కు నరకప్రాయం అనే చెప్పాలి పాపం.

తాజాగా ఈ భామ చేతిలో పలు భాషల్లో రూపొందుతున్న చిత్రాలు ఉన్నాయి కానీ ఎక్కువగా హీరోయిన్ అనే కంటే ఐటమ్ సాంగ్స్ ఉన్న చిత్రాలు ఉన్నాయనే చెప్పాలి. గతకొంత కాలంగా తమన్నాకు ఆశించిన స్థాయిలో విజయాలు దక్కడం లేదు అలాగే సోలో హీరోయిన్ గా ఛాన్స్ లు కూడా రావడం లేదు. అయినా సరే ఎలాగో అలా నెట్టుకుంటు వస్తూనే ఉంది. తెలుగు , తమిళ , హిందీ భాషల్లో మాత్రమే కాకుండా సౌత్ లో ఇతర భాషా చిత్రాల్లో కూడా నటిస్తోంది తమన్నా.

మునుపటి వ్యాసంసస్పెన్స్ థ్రిల్లర్ ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న నాని వి ట్రైలర్
తదుపరి ఆర్టికల్చిరంజీవి ఆచార్య కథ పై కాపీ ఆరోపణలు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి