సుశాంత్ సింగ్ చివరి చిత్రానికి సూపర్ హిట్ టాక్

0
76

దిల్ బేచారా సుశాంత్ సింగ్ రాజ్ పుత్  చివరి చిత్రం. ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీలో నిన్న విడుదల అయ్యింది. సంజన సంఘి హీరోయిన్ గా నటించిన దిల్ బేచారా చిత్రంలో సుశాంత్ సింగ్ నటనకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత విడుదల అవుతున్న చిత్రం కావడంతో పెద్ద సానుభూతి కూడా తోడయ్యింది. దాంతో దిల్ బేచారా సినిమాని పోటీ పడి చూస్తున్నారు జనాలు. ఇక సుశాంత్ అద్భుత నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. సుశాంత్ ఇంత అద్భుతమైన నటుడా ? ఇంతటి గొప్ప నటుడిని ఇంత త్వరగా కోల్పోయామా అని మదనపడుతున్నారు సుశాంత్ ని అభిమానించే వాళ్ళు అలాగే దిల్ బేచారా సినిమా చూసిన వాళ్ళు.

డైరెక్టర్ ముఖేష్ చాబ్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అసలు లాక్ డౌన్ కు ముందు విడుదల కావాల్సి ఉండే కానీ కరోనా మహమ్మారి వల్ల లాక్ డౌన్ విధించడంతో సినిమా విడుదల ఆగిపోయింది. ఇక ఇదే సమయంలో గత నెలలో ఆత్మహత్య చేసుకున్నాడు సుశాంత్ సింగ్. ఒకవేళ సుశాంత్ బ్రతికి ఉంటే ఓటీటీ లో వస్తున్న స్పందనకు పరవశించిపోయేవాడు. దిల్ బేచారా చిత్రానికి ఓటీటీలో అపూర్వ ఆదరణ లభిస్తోంది. సుశాంత్ ని తలచుకొని కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు సుశాంత్ అభిమానులు. మొత్తానికి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి చిత్రం బ్లాక్ బస్టర్ కావడం అంటే ఘనమైన నివాళి అనే చెప్పాలి.

మునుపటి వ్యాసంబిచ్చగాడు 2 ఫస్ట్ లుక్ ,టైటిల్
తదుపరి ఆర్టికల్నితిన్ ని ఆశీర్వదించిన పవన్ కళ్యాణ్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి