సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదల

0
67
TMN logo
TMN logo


బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గత నెల జూన్ 14 న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో సుశాంత్ బయోపిక్ తీయడానికి సన్నాహాలు చేస్తున్నాడు దర్శక నిర్మాత శేఖర్ గుప్తా. ఈరోజు కొద్ది సేపటి క్రితం సుశాంత్ బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇక ఈ బయోపిక్ పేరు ఏంటో తెలుసా……… సూసైడ్ ఆర్ మర్డర్ . దీనికి ఉప శీర్షిక ఏ స్టార్ వాజ్ లాస్ట్. ఇక బయోపిక్ పోస్టర్ లో నటించిన నటుడు కూడా అచ్చం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ని పోలి ఉండటం విశేషం.

టిక్ టాక్ స్టార్ సచిన్ తివారీ సుశాంత్ పాత్రలో నటిస్తున్నాడు. సచిన్ తివారీ అచ్చం సుశాంత్ లాగే ఉండటంతో అతడికి ఫిదా అయ్యేలా ఉన్నారు సినీ అభిమానులు. టిక్ టాక్ ద్వారా వెలుగులోకి వచ్చాడు సచిన్ తివారీ. బాలీవుడ్ లో తక్కువ సమయంలోనే ఎక్కువ స్టార్ డం తెచ్చుకున్న హీరో సుశాంత్ అయితే సినిమా పెద్దల ఆశీర్వాదం లేకపోవడంతో తక్కువ కాలంలోనే మంచి మంచి సినిమాలు కోల్పోయాడు. దాంతో ఆత్మహత్య కు పాల్పడ్డాడు. సుశాంత్ మరణం సినిమా రంగాన్ని కుదిపేసింది. కట్ చేస్తే ఇప్పుడు బయోపిక్ రాబోతోంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి