200 దేశాల్లో విడుదల కానున్న సూర్య సినిమా

0
49
akasham nee hadhu ra

200 దేశాల్లో విడుదల కానున్న సూర్య సినిమా

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ఆకాశమే నీహద్దురా చిత్రం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన అమెజాన్ లో విడుదల కానున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 30 న ఆకాశమే నీహద్దురా చిత్రం అమెజాన్ లో స్ట్రీమింగ్ కి రానుంది. సూర్య హీరోగా నటించిన ఈ చిత్రంలో కీలక పాత్రలో మంచు మోహన్ బాబు నటించడం విశేషం. అయితే ఈ సినిమాని థియేటర్ లోనే విడుదల చేయాలని అనుకున్నాడు సూర్య కానీ కరోనా వల్ల థియేటర్లు మూతబడ్డాయి అలాగే ఒకవేళ థియేటర్లు ఓపెన్ చేసినా ప్రేక్షకులు వస్తారన్న నమ్మకం లేదు అందుకే మరింత ఆలస్యం చేయకుండా ఓటీటీ లో విడుదల చేస్తున్నాడు సూర్య.

ఇప్పటికే ఈ సినిమా మీద తెచ్చిన డబ్బులు వడ్డీలు కలుపుకొని పెద్ద మొత్తం అయ్యింది. రోజు రోజుకి వడ్డీలు పెరిగిపోతున్నాయి కాబట్టి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడట సూర్య. ఇక ఈ సినిమాని దాదాపు 200 దేశాల్లో స్ట్రీమింగ్ అయ్యేలా పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారట. ఇలా చేయడం వల్ల పెద్ద మొత్తంలో కలెక్షన్స్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు. సూర్య కు తమిళనాట మాత్రమే కాకుండా తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. అలాగే ఇతర దేశాలలో కూడా సూర్య కు మంచి ఫాలోయింగ్ ఉంది. దాంతో ఆకాశమే నీహద్దురా పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.

ఆకాశమే నీహద్దురా చిత్రాన్ని ఓటీటీ లో విడుదల చేస్తుంటే బయ్యర్లు మాత్రమే కాదు కొంతమంది దర్శకులు కూడా సూర్య నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. ఓటీటీ లో విడుదల చేయడం వల్ల తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని భావిస్తున్నారట కానీ సూర్య మాత్రం ఎవ్వరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం లేదు ఎందుకంటే ఈ సినిమాకు హీరో మాత్రమే కాదు నిర్మాత కూడా సూర్యే అందుకే నా సినిమా నా ఇష్టం అని అంటున్నాడు. ఆకాశమే నీహద్దురా చిత్రానికి సుధ కొంగర దర్శకత్వం వహించారు. తెలుగులో వెంకటేష్ హీరోగా నటించిన గురు చిత్రానికి దర్శకత్వం వహించింది ఈ సుధ కొంగరే.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి