సురేందర్ రెడ్డి తదుపరి చిత్రం ఏ హీరోతో తెలుసా

0
18

స్టైలిష్ డైరెక్టర్ గా పేరుగాంచిన సురేందర్ రెడ్డి తాజాగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో సైరా నరసింహారెడ్డి చిత్రం చేసిన తర్వాత మళ్ళీ చరణ్ లేదా అల్లు అర్జున్ లతో సినిమా అనుకున్నాడు సురేందర్ రెడ్డి అయితే అటు చరణ్ ఇటు అల్లు అర్జున్ ఇద్దరు కూడా చాలా బిజీ గా ఉన్నారు దాంతో ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేయడం ఇష్టంలేక రామ్ తో సినిమా కమిట్ అయ్యాడట. త్వరలోనే ఈ కాంబినేషన్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందట.

రామ్ తాజాగా రెడ్ అనే చిత్రం చేస్తున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అయితే థియేటర్లు ఇప్పట్లో ప్రారంభం అయ్యేలా కనిపించడం లేదు కాబట్టి ఓటీటీలో విడుదల చేయనున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. రామ్ కోసం ఓ స్టైలిష్ స్టోరీ రాసుకున్నాడట సురేందర్ రెడ్డి. కెరీర్ ప్యారంభం నుండి కూడా అగ్ర హీరోల చిత్రాలే చేస్తున్నాడు సురేందర్ రెడ్డి. చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్ , అల్లు అర్జున్ , రాంచరణ్ లతో సినిమాలు చేశాడు సురేందర్ రెడ్డి. ఇక ఇప్పుడేమో రామ్ తో చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఇప్పుడు కేవలం ప్రకటన మాత్రమే వెలువడనుంది. షూటింగ్ మాత్రం డిసెంబర్ తర్వాతే అని తెలుస్తోంది.  

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి