పుకార్లపై మండిపడిన సురేఖావాణి

0
59
actore surekha vani

పుకార్లపై మండిపడిన సురేఖావాణి

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి తనపై తన కూతురుపై వస్తున్న పుకార్లపై  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేను భర్తని కోల్పోయి బాధపడుతుంటే ,నేను ఎవరితో కనిపిస్తే వాళ్లతో సంబంధాలు అంటగడుతూ అనవసరపు పుకార్లు పుట్టిస్తున్నారని , అయితే నేను అందరితో కూడా మంచి సంబంధాలను మాత్రమే కలిగి ఉన్నానని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే  జీవితంలో నా భర్తని కోల్పోవడమే నాకు అతిపెద్ద లోటు అని వ్యాఖ్యానించి దుఃఖాన్ని దిగమింగుకుంటోంది సురేఖావాణి. 43 ఏళ్ల సురేఖావాణి గత ఏడాది భర్త సురేష్ తేజ ని కోల్పోయింది. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురేష్ మరణం సురేఖావాణి జీవితాన్ని అతలాకుతలం చేసింది.

భర్త మరణంతో కొంత కాలంగా సినిమాలకు దూరమైంది. అంతకుముందు గత దశాబ్ద కాలంగా అత్యధిక చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది సురేఖావాణి. హాస్య నటిగా , అక్కగా , వదినగా , అత్తగా ఇలా రకరకాల పాత్రల్లో నటించి ఆయా పాత్రలకు వన్నె తెచ్చింది. సినిమాల్లోకి రాకముందు మొగుడ్స్ పెళ్లామ్స్ అనే కార్యక్రమంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది సురేఖావాణి.

అయితే భర్త చనిపోకముందు అలాగే భర్త చనిపోయాక కూడా సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటోంది సురేఖావాణి. ఫేస్ బుక్ లో ఇన్ స్టా గ్రామ్ లో తన కూతురుతో కలిసి మోడ్రన్ వేర్ లో దర్శనం ఇస్తూ రకరకాల పాటలకు డ్యాన్స్ లు చేస్తూ బాగానే హంగామా చేస్తోంది. అంతేనా ఆ డ్యాన్స్ లను అలాగే మోడ్రన్ వేర్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. అయితే నా జీవితం నా ఇష్టం , నా కూతురు ని కూడా స్వతంత్య్ర భావాలున్న అమ్మాయిగా పెంచుతాను ఎవ్వరినీ లెక్కచేయల్సిన అవసరం లేదని కుండబద్దలు కొడుతోంది సురేఖావాణి. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి