హీట్ పెంచుతున్న సురేఖా వాణి

0
73
surekha vani

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి కుర్రాళ్ళ గుండెల్లో హీట్ పెంచుతోంది. 43 సంవత్సరాల సురేఖా వాణి మొదట తెలుగులో పలు టీవి కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ముఖ్యంగా మొగుడ్స్ పెళ్ళామ్స్ అనే టివి షో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది. ఆ షోలో శివాజీరాజా – సురేఖ వాణి మొగుడ్స్ పెళ్ళామ్స్ గా నటించారు. నిజమైన భార్యాభర్తల మాదిరి అని ప్రచారం కావడంతో ఇక ఆ కార్యక్రమాన్ని ఆపేశారు. కట్ చేస్తే బుల్లితెర నుండి వెండితెరపైకి వచ్చేసింది సురేఖా వాణి. తెలుగులో వందలాది చిత్రాల్లో అక్కగా , వదినగా రకరకాల పాత్రలను పోషించింది.

తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సురేఖా వాణి జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో ఒక్కసారిగా భారీ కుదుపుకి లోనయ్యింది. భర్త సురేష్ తేజ అనారోగ్యంతో కన్నుమూయడంతో తీవ్ర దుఃఖసాగరంలో మునిగింది. కట్ చేస్తే ఆ బాధ నుండి తెరుకోవడానికి తన కూతురుతో కలిసి టిక్ టాక్ లు డ్యాన్స్ లు గట్రా చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కాలక్షేపం చేస్తోంది. తాజాగా కుర్రాళ్ళ గుండెల్లో హీట్ పెంచేలా ఓ ఫోటోని షేర్ చేసింది. ఇప్పుడా ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మునుపటి వ్యాసంపుకార్లు ఖండించిన రాంగోపాల్ వర్మ
తదుపరి ఆర్టికల్సూపర్ స్టార్ రజనీకాంత్ నటుడిగా 45 ఏళ్ళు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి