ఆత్మహత్యకు ప్రయత్నించిన రాజీవ్ హాంతకురాలు

0
47
TMN logo
TMN logo

1991 లో రాజీవ్ గాంధీ ని అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసులో నిందితురాలు నళిని తాజాగా తమిళనాడులోని వేలూరు జైల్లో ఆత్మహత్య కు పాల్పడింది. గత 29 సంవత్సరాలుగా జైలు జీవితం అనుభవిస్తోంది నళిని. భారతదేశంలో జీవిత ఖైదు శిక్ష పడిన వాళ్ళు సైతం 14 ఏళ్ళు మాత్రమే శిక్ష అనుభవిస్తారు కానీ నళిని మాత్రం గత 29 సంవత్సరాలుగా వేలూరు జైల్లోనే మగ్గుతోంది. క్షమాభిక్ష కోరుతున్నప్పటికి నళిని కి మాత్రం ఇంతవరకు కూడా క్షమాభిక్ష దొరకలేదు.

రాజీవ్ గాంధీ 1991 లో ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడుకు వచ్చారు. పేరంబుదూర్ లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడటానికి వచ్చిన సమయంలో ప్రజలను పలకరిస్తూ చేతులు ఊపుతున్న తరుణంలో బెల్ట్ బాంబ్ పెట్టుకున్న మహిళ రాజీవ్ గాంధీ కాళ్లకు మొక్కి తనని తాను పేల్చుకుంది. మానవ బాంబ్ తో పేల్చడంలో రాజీవ్ గాంధీ దేహం ఛిద్రమై పోయింది. రాజీవ్ గాంధీ హత్య అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. వెంటనే రంగంలోకి దిగిన దర్యాప్తు బృందం నళిని తో పాటు మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారు. అప్పటి నుండి నళిని వేలూరు జైల్లోనే శిక్ష అనుభవిస్తోంది. దాంతో విసిగి వేసారిన నళిని జైల్లోనే ఆత్మహత్య కు పాల్పడింది. అయితే ఆమెని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది నళిని.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి