ఆత్మహత్యకు ప్రయత్నించిన హీరోయిన్

0
42

హీరోయిన్ , తమిళ నటి విజయలక్ష్మి ఆత్మహత్యకు ప్రయత్నించింది. సోషల్ మీడియాలో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా పోస్ట్ చేసిన వీడియో సంచలనం సృష్టిస్తోంది. తమిళనాడుకు చెందిన సీమన్  , హరి నాడర్ ఇద్దరు కూడా రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్లు. ఈ ఇద్దరు కూడా విజయలక్ష్మి ని దారుణంగా వేధిస్తున్నారట. ఈ ఇద్దరి వేధింపులు తట్టుకోలేక చనిపోవాలని నిర్ణయించుకున్నానని, నా చావుతో నైనా కనువిప్పు కలుగుతుందని ఆశిస్తున్నా అంటూ వీడియో పోస్ట్ చేసింది. ఇప్పుడా వీడియో సంచలనం సృష్టిస్తోంది సోషల్ మీడియాలో.

విజయలక్ష్మి తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. తెలుగు ప్రేక్షకులకు కూడా విజయలక్ష్మి సుపరిచితు రాలు కావడం గమనార్హం. పలు చిత్రాల్లో నటించిన విజయలక్ష్మి గతకొంత కాలంగా సినిమాల్లో నటించడం లేదు. బీపీ సమస్యలతో బాధపడుతోంది విజయలక్ష్మి. నాకు ఎప్పుడో బీపీ తక్కువైపోయి చనిపోతానని అందుకు సీమన్ , హరి నాడర్ లే కారణమని, వాళ్లకు రాజకీయంగా అండదండలు ఉన్నాయి కాబట్టే నన్ను ఇంతగా వేధిస్తున్నారని ఆరోపిస్తోంది. అయితే విజయలక్ష్మి వీడియో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. మీరు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు. అలాంటి చీడ పురుగులకు తగిన బుద్ధి చెప్పాలని అందుకు మేము మీకు అండగా ఉంటామని అంటున్నారు.

మునుపటి వ్యాసంఘనంగా నితిన్‌-శాలిని వివాహం ఫొటోస్
తదుపరి ఆర్టికల్సోనూ సుద్ పై ప్రశంసల వర్షం
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి