మహేష్ సినిమాలో విలన్ గానైనా చేస్తానంటున్న సుధీర్ బాబు

0
97
sudheer babu brother in of mahesh babu

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో విలన్ గా చేయడానికి నేను సిద్ధమని అంటున్నాడు హీరో సుధీర్ బాబు. మహేష్ బాబు – సుధీర్ బాబు ఇద్దరు కూడా బావ – బావమరుదులు అన్న విషయం తెలిసిందే. సుధీర్ బాబు హీరోగా తెలుగులో పలు చిత్రాల్లో నటించాడు. హీరోగా ఓ మోస్తారు విజయాలు అందుకున్నాడు కానీ స్టార్ హీరో కాలేకపోయాడు. అయితే నటుడిగా హీరోగా మాత్రం తనని తాను నిరూపించుకుంటున్నాడు. బాలీవుడ్ లో భాగీ చిత్రంలో విలన్ గా నటించి ఉత్తరాదిన కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించాడు సుధీర్ బాబు.

మహేష్ బాబు తన బావమరిది కాబట్టి అతడి సినిమాలో నటించడం పెద్ద మ్యాటర్ కాదు ఎందుకంటే ఉన్న పాత్రల్లో ఏదో ఒకటి చేయొచ్చు. కానీ సుధీర్ బాబుకు అలా లేదు చేస్తే మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర చేయాలని ఉంది. ఒకవేళ చిన్న పాత్ర చేసినా దాని ఇంపాక్ట్ ఉండాలని భావిస్తున్నాడు. ఇక మరో అడుగు ముందుకు వేసి మహేష్ బాబు సినిమాలో విలన్ గా నటించడానికి నేను సిద్ధమని ప్రకటించాడు సుధీర్ బాబు. తాజాగా సుధీర్ బాబు వి చిత్రంలో పవర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఆ సినిమా సెప్టెంబర్ 5 న అమెజాన్ లో స్ట్రీమింగ్ కి రానుంది.

దాంతో ఆ సందర్భంగా  మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా మహేష్ బాబు సినిమాలో నెగెటివ్ రోల్ పోషించడానికి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. మహేష్ బాబుతో రెగ్యులర్ గా ఫోన్ లో టచ్ లో ఉంటానని , పలు విషయాలు మాట్లాడుకుంటామని అలాగే నెలలో ఒకటి రెండు సార్లు కలుస్తుంటామని కూడా స్పష్టం చేశాడు సుదీర్ బాబు. ఇక వి చిత్ర విషయానికి వస్తే నాని నెగెటివ్ రోల్ పోషించగా సుధీర్ బాబు మాత్రం పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. సుధీర్ బాబు యాక్షన్ పార్ట్ కూడా వి చిత్రానికి హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.

మునుపటి వ్యాసంనటుడిగా 46 ఏళ్ళు పూర్తిచేసుకున్న బాలకృష్ణ
తదుపరి ఆర్టికల్యాంకర్ ప్రదీప్ కు రేప్ కేసుతో సంబంధం లేదట
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి