టైం వృథా అయినందుకు బాధపడుతున్న స్టార్ డైరెక్టర్

0
14
భరత్ అనే నేను చిత్రం విడుదలై రెండేళ్లు దాటిపోయింది. 2018 ఏప్రిల్ లో భరత్ అనే నేను చిత్రం విడుదల అయ్యింది. దాని తర్వాత కొరటాల శివ తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావల్సి ఉండే రకరకాల కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక శరవేగంగా షూటింగ్ చేయడమే అని సర్వసన్నద్దం అయిన సమయంలో కరోనా విజృంభించింది. దాంతో షూటింగ్ లన్నీ రద్దు అయ్యాయి. ఆచార్య షూటింగ్ కూడా ఆగిపోవడంతో కొరటాల శివ చాలా బాధపడుతున్నాడట.

అప్పుడే భరత్ అనే నేను సినిమా విడుదలై రెండేళ్లు అవుతోందని బాధపడుతున్నాడట దర్శకుడు కొరటాల శివ. రెండేళ్ళ కాలం వృథా అయ్యిందని మదనపడుతున్నాడట కొరటాల. భరత్ అనే నేను తర్వాత ఆచార్య స్టార్ట్ కావడానికి చాలా సమయం పట్టింది దాంతో ఈ ఆలస్యం. ఇక ఇప్పుడేమో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో షూటింగ్ చేసే పరిస్థితి లేదు. మరో నాలుగు నెలల పాటు షూటింగ్ లు జరిగే అవకాశం కనబడటం లేదు దాంతో మరింతగా దిగులు మొదలైందట. కొరటాల శివ దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన అన్ని చిత్రాలు కూడా సంచలన విజయాలు సాధించాయి.  

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి