ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి రానున్న ఎస్ ఎస్ రాజమౌళి

0
43

ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నాడట. కరోనా వల్ల ఎలాగూ షూటింగ్ చేయలేకపోతున్నాం కాబట్టి షూటింగ్ చేసే యంగ్ టాలెంట్ కు అండగా నిలవాలని చూస్తున్నాడట. కరోనా ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో తెలియడం లేదు కాబట్టి తన షూటింగ్ ఇప్పట్లో జరిగేది లేదు కాబట్టి ఈలోపు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలని డిసైడ్ అయ్యాడట జక్కన్న.

కొత్త కొత్త కాన్సెప్ట్ లతో వచ్చే వాళ్ళను ప్రోత్సహిస్తే యంగ్ టాలెంట్ బయటకు వస్తుందని అది చిత్ర పరిశ్రమకు ఎంతో మంచి జరుగుతుందని అభిప్రాయపడుతున్నాడట. ఇప్పటికే కొంతమంది టాలెంట్ ని పసిగట్టిన జక్కన్న వాళ్ళతో రకరకాల ప్రయోగాలు చేసే పనిలో పడ్డాడట. జక్కన్న బ్రాండ్ ఉంటె ఆ వెబ్ సిరీస్ లకు ఎనలేని డిమాండ్ ఉంటుంది. దాంతో పెట్టిన పెట్టుబడికి లాభాలు కూడా ఎక్కువే వస్తాయి కాబట్టి మంచి కాన్సెప్ట్ లను ఎంచుకొని వాటిని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే చాలు అనే నిర్ణయానికి వచ్చాడట జక్కన్న. ఒకవేళ ఇదే జరిగితే యంగ్ టాలెంట్ కు మరిన్ని మంచి రోజులు వచ్చినట్లే.

మునుపటి వ్యాసంపెళ్ళైనా శృంగార సన్నివేశాల్లో నటిస్తానంటున్న భామ
తదుపరి ఆర్టికల్ప్రభాస్ ఫ్యాన్స్ కు శుభవార్త : ఫస్ట్ లుక్ వచ్చేసింది
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి