‘శ్రీ‌కారం’లో సాయికుమార్ ‘ఏకాంబ‌రం’ పాత్ర లుక్ విడుద‌ల

0
62

సాయికుమార్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ‘శ్రీ‌కారం’లో ఆయ‌న పాత్ర ‘ఏకాంబ‌రం’ లుక్ విడుద‌ల‌

హీరో శ‌ర్వానంద్ న‌టిస్తోన్న  ఫిల్మ్ ‘శ్రీ‌కారం’ షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. కిశోర్ బి. డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో హీరోయిన్‌గా ప్రియాంకా అరుళ్ మోహ‌న్ న‌టిస్తున్నారు.

జూలై 27 డైలాగ్ కింగ్ సాయికుమార్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా, ఈ సినిమాలో ఆయ‌న లుక్‌తో కూడిన పోస్ట‌ర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది.

సాయికుమార్ ఈ చిత్రంలో ఏకాంబ‌రం అనే కీల‌క పాత్ర చేస్తున్నారు. స‌న్న‌ని మీస‌క‌ట్టుతో యంగ్ లుక్‌లో ఆయ‌న‌ క‌నిపిస్తున్నారు.

శ‌ర్వానంద్ బ‌ర్త్‌డేకి రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌, స్పెష‌ల్ టీజ‌ర్‌కు అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది.

‘గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపీ ఆచంట నిర్మిస్తోన్న రెండో చిత్రం ‘శ్రీ‌కారం’.

‘గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌’కు వండ‌ర్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చిన మిక్కీ జె. మేయ‌ర్ ‘శ్రీ‌కారం’ చిత్రానికీ చ‌క్క‌ని బాణీలు అందిస్తున్నారు. బుర్రా సాయిమాధ‌వ్ డైలాగ్స్ రాస్తుండ‌గా, జె. యువ‌రాజ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

తారాగ‌ణం:
శ‌ర్వానంద్‌, ప్రియాంకా అరుళ్ మోహ‌న్‌, రావు ర‌మేష్‌, ఆమ‌ని, న‌రేష్‌, సాయికుమార్‌, ముర‌ళీ శ‌ర్మ‌, స‌త్య‌, స‌ప్త‌గిరి.

మునుపటి వ్యాసంకరోనా బాధితుడిగా బాధలు పంచుకున్నారు అమితాబ్
తదుపరి ఆర్టికల్టాలీవుడ్ టాప్ 10 లవింగ్ హీరోల జాబితా ఇదేనట
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి