దగ్గుబాటి అభిరామ్ ని తిడుతూ  శ్రీరెడ్డి వీడియో

0
48
sriya reddy

దగ్గుబాటి అభిరామ్ ని తిడుతూ వివాదాస్పద భామ శ్రీరెడ్డి ఓ వీడియో ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేవుడున్నాడ్రా …… నన్ను , నా కారుని అవమానించావ్ అందుకే నీకు కారు యాక్సిడెంట్ అయ్యింది. అందం , డబ్బు ఉందని మిడిసిపడకు తప్పకుండా ఆ దేవుడు గుణపాఠం చెబుతాడు అంటూ తీవ్ర స్థాయిలో అభిరామ్ పై విరుచుకుపడింది శ్రీరెడ్డి. దగ్గుబాటి అభిరామ్ కారు కు మణికొండ సమీపంలో చిన్న యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే. ఈ యాక్సిడెంట్ లో రెండు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి తప్ప ఎలాంటి గాయాలు కాలేదు.

శ్రీరెడ్డి గతంలో దగ్గుబాటి అభిరామ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి టాలీవుడ్ ని షేక్ చేసింది. కట్ చేస్తే  అవకాశాలు లేకపోవడంతో తమిళనాడుకి వెళ్ళింది. అక్కడ ఒకటి అరా చిత్రాల్లో నటించినప్పటికీ అక్కడ కూడా పెద్ద ఎత్తున కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. దాంతో సరైన వేషాలు లేక ఇలా ఫేస్ బుక్ లో వివాదాస్పద వీడియోలు పెడుతూనే ఉంది. అయితే ఇటీవల మణికొండ పరిసర ప్రాంతాల్లో అభిరామ్ కారు యాక్సిడెంట్ కు గురైనప్పటికీ మా కారుకు ఎలాంటి యాక్సిడెంట్ కాలేదు అని స్టేట్ మెంట్ ఇచ్చారు. కట్ చేస్తే రాయదుర్గం పోలీసులు మాత్రం యాక్సిడెంట్ జరిగిందని ఫిర్యాదు కూడా అందిందని మీడియాకు చెప్పడం విశేషం. 

మునుపటి వ్యాసంఅప్సరా రాణి అందాలతో థ్రిల్లర్ చిత్రం 11 భాషల్లో
తదుపరి ఆర్టికల్కాస్టింగ్ కౌచ్ పై అనసూయ వ్యాఖ్యలు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి