ఆ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్

0
56
srinivasa athreya

ఆ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్

నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన చిత్రం ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. గత ఏడాది చిన్న చిత్రంగా వచ్చిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. మూసలో వెళ్తున్న తెలుగు సినిమాకు మంచి ఊపునిచ్చే చిత్రంగా నిలిచింది ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ చిత్రానికి సీక్వెల్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో పడ్డారు దర్శక నిర్మాతలు. స్వరూప్ మొదటి సినిమానే సూపర్ హిట్ కావడంతో స్వరూప్ కి మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక ఈ సీక్వెల్ కు కూడా స్వరూప్ దర్శకత్వం వహించనున్నాడు.

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా రీమేక్ చేస్తున్నారు. ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా తమిళంలో అలాగే మలయాళంలో కూడా రిమేక్ అవుతోంది. ఒకవైపు ఇతర భాషల్లో రీమేక్ అవుతుండగా మరోవైపు సీక్వెల్ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఇక కరోనా తగ్గిన తర్వాత షూటింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏజెంట్ పాత్రలో నవీన్ పొలిశెట్టి అభినయం నభూతో నభవిష్యత్ అన్నట్లుగా సాగింది దాంతో ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. హీరోగా నటించే ముందు నవీన్ పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. ఏజెంట్ చిత్రం ఒక్కసారిగా హీరోని చేసింది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి