ఈసారి చిరు బర్త్ డే ప్రత్యేకతలు ఏంటో తెలుసా

0
34
chiranjeevi

 

ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు పైగా ఈ పుట్టినరోజు 65 వ పుట్టినరోజు కావడం విశేషం దాంతో ఈ బర్త్ డేని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ బర్త్ డే ప్రత్యేకతలు ఏంటో తెలుసా ……  65 మంది ప్రముఖులతో చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేలా విశిష్టంగా ప్లాన్ చేస్తున్నారు. సినిమా రంగంలోని అన్ని భాషల ప్రముఖులతో చిరుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేలా పసన్నాహాలు జరుగుతున్నాయి. హిందీ , మలయాళం , తమిళ్ , తెలుగు , కన్నడ భాషలతో పాటుగా ఇతర భాషల నటీనటులతో , సాంకేతిక నిపుణులతో కూడిన వినూత్నమైన విషెష్ తెలియజేయడానికి రంగం సిద్ధమైంది.

అలాగే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరు నటిస్తున్న చిత్రం ఆచార్య. ఆ సినిమా నుండి ఫస్ట్ లుక్ తో పాటుగా మోషన్ పోస్టర్ ని అలాగే వేదాళం సినిమా గురించి కానీ లేదంటే లూసిఫర్ చిత్రం నుండి కానీ ఏదో ఒక  అప్ డేట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అంటే మెగా అభిమానులకు పండగే పండగ అన్నమాట. ఒకేసారి ఇన్ని ప్రత్యేకతలు అంటే మెగా అభిమానులు పరవశించి పోవడం ఖాయం. 1955 ఆగస్టు 22 న జన్మించిన చిరంజీవి 64 ఏళ్ళు పూర్తి చేసుకొని 65 వ ఏట అడుగు పెట్టనున్నాడు ఈ పుట్టినరోజుకి. రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు దూరమైన చిరంజీవి రీ ఎంట్రీలో నటించిన ఖైదీ నెంబర్ 150 , సైరా నరసింహారెడ్డి చిత్రాలతో అదరగొట్టాడు. బాస్ ఈజ్ బ్యాక్ అనిపించాడు దాంతో మెగా అభిమానులు ఖుషీగా ఉన్నారు.

మునుపటి వ్యాసండబుల్ గేమ్ ఆడుతున్న  వర్మ
తదుపరి ఆర్టికల్100 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్న ప్రభాస్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి