వెంటిలేటర్ పై ఎస్పీ బాలు

0
45

 

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. చెన్నై లోని ఎంజీఎం ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు బాలు. కరోనాతో బాధపడుతున్న బాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఎంజీఎం ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న బాలు ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. అయితే విదేశీ డాక్టర్ల సూచనతో ఎక్మో పరికరంతో వైద్యం అందిస్తున్నారు ఇక్కడి డాక్టర్లు. ప్రస్తుతం బాలు ఆరోగ్యం విషమంగానే ఉందని , అయితే కొద్ది రోజుల్లోనే ఆయన కోలుకుంటారన్న నమ్మకం ఉందన్నారు ఎంజీఎం డాక్టర్లు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా తో పోరాడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడన్న విషయం యావత్ సినీ ప్రపంచాన్ని షాక్ కి గురి చేసింది. దాంతో బాలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ పలువురు సినీ ప్రముఖులు వీడియో సందేశాలను పంపారు. ఇక దక్షిణ భారతదేశంలోని యావత్ సినీ పరిశ్రమ ఈరోజు సాయంత్రం సామూహిక ప్రార్థనలను చేయనుంది. ఎవరి ఇంట్లో వాళ్ళు బాలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ బాలు ఆలపించిన పాటలను పాడనున్నారు.

ఈ వేడుకలో రజనీకాంత్ , చిరంజీవి , కమల్ హాసన్ , నాగార్జున , మోహన్ లాల్ , మమ్ముట్టి తదితర స్టార్ హీరోలు సైతం పాల్గొననున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కేవలం తెలుగు చిత్రాలకు మాత్రమే కాకుండా హిందీ , తమిళ్ , మలయాళం , కన్నడం తో పాటుగా పలు భాషల్లో పాటలు పాడాడు. కరోనా తో బాధపడుతూ ఐసీయూలో  ఉన్న బాలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తోంది టాలీవుడ్ మూవీ న్యూస్ .

మునుపటి వ్యాసంపుకార్లను ఖండించిన డైరెక్టర్ క్రిష్
తదుపరి ఆర్టికల్సోనూ సూద్ కు ఇప్పటివరకు ఎన్ని మెసేజ్ లు వచ్చాయంటే
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి