ఎస్పీ బాలు కన్నుమూత

0
53
sp balu nomore

టాలీవుడ్ మూవీ న్యూస్,
చెన్నై- చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించారు దాంతో భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. బాలసుబ్రహ్మణ్యం గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆగస్టు 5 న కరోనాతో బాధపడుతూ చెన్నై లోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరాడు. శ్వాసకోశ వ్యాధితో ఆసుపత్రిలో చేరిన బాలు దాదాపు 50 రోజుల పాటు ఆసుపత్రిలోనే చికిత్స పొందాడు. అయితే పరిస్థితి విషమించడంతో ఎక్మో , వెంటిలేటర్ పై చికిత్స అందించారు డాక్టర్లు.

కరోనా అదుపులోకి వచ్చినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో కొంత ఆందోళన వ్యక్తం అయ్యింది. అయితే రెండు వారాల క్రితం బాలు కోలుకున్నట్లే అని డాక్టర్లు తెలిపారు అయితే రెండు వారాలు గడిచిన తర్వాత మళ్ళీ బాలు ఆరోగ్యం విషమించినట్లు ప్రకటించారు డాక్టర్లు. ఇక ఈరోజు సెప్టెంబర్ 25 న మధ్యాహ్నం ఒంటిగంటకు బాలు తుదిశ్వాస విడిచినట్లు ప్రకటించారు. దాంతో బాలు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. ఎస్పీ బాలుకు ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు చరణ్ కాగా కూతురు పల్లవి. కూతురు పల్లవి కి అలాగే కొడుకు చరణ్ కు కూడా ఇద్దరు కవల పిల్లలే సంతానం కావడం విశేషం.
1946 జూన్ 4 న నెల్లూరు జిల్లా కోనెటమ్మ పేట అనే గ్రామంలో జన్మించాడు బాలు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన బాలు ఇంజనీర్ కాబోయి సింగర్ అయ్యాడు. తెలుగు , హిందీ , తమిళ్ , మలయాళం , కన్నడం లలో వేలాది పాటలు పాడారు బాలు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 14 వేల పాటలు పాడారు బాలు. ప్రపంచ వ్యాప్తంగా ఇన్ని పాటలు పాడిన గాయకులు ప్రపంచ సినీ చరిత్రలో మరొకరు లేరు. బాలు మృతికి పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు. 

మునుపటి వ్యాసంఏడేళ్ల తర్వాత డైరెక్టర్ గా ఛాన్స్
తదుపరి ఆర్టికల్బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి